Viral Video: గాలానికి చిక్కిన భారీ చేప.. ఒక్కసారిగా దూసుకొచ్చిన అనుకోని అతిధి.. కట్ చేస్తే!

విదేశాల్లో ఫిషింగ్ చేసేవారి సంఖ్య ఎక్కువే. కొంతమంది వీకెండ్స్‌లో స్థానికంగా ఉండే సరస్సు దగ్గరకు చేపలు పట్టేందుకు వెళ్తే..

Viral Video: గాలానికి చిక్కిన భారీ చేప.. ఒక్కసారిగా దూసుకొచ్చిన అనుకోని అతిధి.. కట్ చేస్తే!
Fishing
Ravi Kiran

|

Aug 02, 2022 | 9:13 PM

విదేశాల్లో ఫిషింగ్ చేసేవారి సంఖ్య ఎక్కువే. కొంతమంది వీకెండ్స్‌లో స్థానికంగా ఉండే సరస్సు దగ్గరకు చేపలు పట్టేందుకు వెళ్తే.. మరికొందరు నెలకోసారి నదిలో బోటింగ్‌కు వెళ్లి చేపలు పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇదే కోవలో తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ నది వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. గాలానికి ఎరను కట్టి.. నీటిలో వేశాడు. కొద్దిసేపు వేచి చూడగా.. ఆ గాలం బరువెక్కింది. పెద్ద చేప చిక్కినట్లు ఉందనుకుంటూ గాలాన్ని బయటికి తీశాడు. అతడు అనుకున్నట్లే భారీ చేప చిక్కింది. అయితే కథలో అదిరిపోయే ట్విస్ట్ ఇప్పుడే వచ్చింది. గాలానికి చిక్కిన చేపను తనతో పాటు తీసుకెళ్లాలని అనుకున్న అతడికి షాక్ ఇస్తూ.. ఎక్కడ నుంచో ఎగురుకుంటూ వచ్చిన ఓ గ్రద్ద.. ఆ చేపను తన్నుకుపోతుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu