ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..! నమ్మిన ఓ జంటకు నిలువు దోపిడీ

గొర్రె గుంటలో పడింది అన్నట్టుగా.. ఆ వైపు నుంచి మోసగాళ్లు అనేక అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టారు. మీషో కంపెనీ వారిని ఎంపిక చేసినట్లు నటించారు. ముఖ్యంగా మీరు మా కంపెనీకి రెగ్యులర్ కస్టమర్ అని, మీకు లక్కీ డ్రా వచ్చిందంటూ వారికి పూర్తి నమ్మకం కలిగేలా ఓ మహిళతో మాట్లాడించారు.. ఇద్దరం కలిసికట్టుగా ఉండి మోసగాళ్లు చెప్పిన మాటలు వింటూ సంతోషించారు.

ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..! నమ్మిన ఓ జంటకు నిలువు దోపిడీ
Lucky Draw Fraud
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 23, 2024 | 4:20 PM

ఇంటికి కొరియర్ వచ్చిందంటూ..ఆన్‌లైన్ మోసగాళ్లు అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎపిక్ లింక్, ఫోన్ కాల్, ఇ-మెయిల్, ఇతర రకాల మోసపూరిత పద్ధతులను ఉపయోగించి వారి ఇంటి చిరునామాకు కొరియర్ పంపడం ద్వారా ఓ జంటను ట్రాప్ చేశారు. కేటుగాళ్లను నమ్మిన ఆ దంపతులు రూ. 52 లక్షలు పోగొట్టుకునే వరకు తాము మోసగాళ్ల వలలో పడ్డామని ఈ జంట గ్రహించలేదు. ఆ కేటుగాళ్లు చెప్పినట్లే డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉన్నారు దంపతులు. చివరకి స్నేహితుల వద్ద అప్పు చేసి డబ్బులు డిపాజిట్ చేశారు. అదే స్నేహితులను పదే పదే డబ్బులు అడగడంతో ఈ మోసం బట్టబయలైంది. కర్ణాటక జిల్లాలోని హోళగుంద పట్టణంలో గత జనవరిలో మొదలైన ఈ మోసం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది.

మీషో కంపెనీ పేరుతో ఓ దంపతుల ఇంటి చిరునామాకు ఒక కొరియర్ వచ్చింది. మీషో సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి బహుమతిగా రూ.15 లక్షల నగదు, ద్వితీయ బహుమతిగా కారు అని చెప్పారు. మీరు మా రెగ్యులర్ కస్టమర్ (భార్య మీషో యాప్‌లో గృహాలు మరియు మహిళల వస్తువులను బుక్ చేసేవారు) కాబట్టి మీరు లక్కీ డ్రాకు ఎంపికయ్యారు. మరిన్ని వివరాల కోసం ఈ నంబర్‌ను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. అది నమ్మిన దంపతులు మోసగాళ్ల వలయంలో పడ్డారు.

కొరియర్ ద్వారా పంపిన లేఖలోని ఫోన్ నంబర్లకు దంపతులు ఫోన్ చేశారు.. మీ కంపెనీ నుంచి మాకు లేఖ వచ్చిందని, లక్కీ డ్రాకు ఎంపికయ్యామని, దీనిపై ఆరా తీశామని కోరారు. అంతే..ఇంకేముందు.. గొర్రె గుంటలో పడింది అన్నట్టుగా.. ఆ వైపు నుంచి మోసగాళ్లు అనేక అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టారు. మీషో కంపెనీ వారిని ఎంపిక చేసినట్లు నటించారు. ముఖ్యంగా మీరు మా కంపెనీకి రెగ్యులర్ కస్టమర్ అని, మీకు లక్కీ డ్రా వచ్చిందంటూ వారికి పూర్తి నమ్మకం కలిగేలా ఓ మహిళతో మాట్లాడించారు.. ఇద్దరం కలిసికట్టుగా ఉండి మోసగాళ్లు చెప్పిన మాటలు వింటూ సంతోషించారు.

ఇవి కూడా చదవండి

అయితే, మీషో కంపెనీ లక్కీ డ్రా కోసం గిఫ్ట్‌ కోసం మీరు హాంకాంగ్ బ్యాంక్ ఖాతాను తెరవాలని చెప్పింది సదరు కిలాడీ గ్యాంగ్. అందుకు రూ15 వేలు పెట్టాలని చెప్పారు. మొదట 15,000 పెట్టారు. ఆ తర్వాత పలు రకాల పన్నులు చెల్లించాలని చెబుతూ పలుమార్లు డబ్బులు డిపాజిట్ చేశారు. అప్పటి వరకు మనం మోసపోయామని ఈ దంపతులకు తెలియదు. ప్రధానంగా పొలం అమ్మిన డబ్బుతో బ్యాంకులో ఎఫ్ డీ పెట్టారు. ఆ డబ్బు రెట్టింపు అయింది. అతను అదే డబ్బును మీషో యాప్ కంపెనీ పేరుతో మోసపూరిత నెట్‌వర్క్‌లో పోగొట్టుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా