Student Video: క్లాస్ రూమ్ లో చిన్నారి నిద్రపోవడలో బిజీ బిజీ.. మీ బాల్యం కనులముందుకు తెచ్చే వీడియో వైరల్..

తరగతి గతిలో ఒక పిల్లవాడు నిద్రపోవడంలో బిజీగా ఉన్నాడు. టీచర్ చెబుతున్న పాఠం తనకు అమ్మపాడిన లాలి పాట అనుకున్నాడేమో ఆ చిన్నారి బాలుడు హ్యాపీగా కునుకు తీస్తున్నాడు. అలా నిద్రపోతూ ఉగిపోతూనే ఉన్నాడు.

Student Video: క్లాస్ రూమ్ లో చిన్నారి నిద్రపోవడలో బిజీ బిజీ.. మీ బాల్యం కనులముందుకు తెచ్చే వీడియో వైరల్..
Little Boy Sleeping
Follow us

|

Updated on: Nov 22, 2022 | 12:19 PM

తమ బాల్యాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి.? పెద్దయ్యాక చిన్నప్పటి సంగతులు గుర్తుకొస్తాయి. మళ్లీ పిల్లలుగా మారాలని, విలువైన బాల్యం తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ఏదొక సమయంలో ఏదొక సందర్భంలో కోరుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నతనంలో చేసే సరదాలు, అల్లరి మనుషుల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందుకనే బాల్యం ప్రతి ఒక్కరికీ అపురూపం. ఇల్లు లేదా పాఠశాల ఏదైనా, పిల్లలు ప్రతిచోటా తమ అల్లరిని వీలైనప్పుడల్లా జ్ఞాపకాలుగా  నెమరువేసుకుంటూ ఉంటారు. మీరు మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటే.. ఖచ్చితంగా పాఠశాలలో కూర్చుని పాఠాలు వినే సమయంలో నిద్ర రావడం.. తరచుగా నిద్రపోయిన సందర్భం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అలా నిద్రపోయి టీచర్ తో దెబ్బలు తిన్న సంఘటనలు కూడా కొందరికి జ్ఞాపకాలుగా ఉంటాయి. ప్రస్తుతం ఓ బాల్యానికి సంబంధించిన పిల్లల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీ బాల్యం గుర్తుకు వస్తుంది. మీ ముఖంపై చిరునవ్వు కదలాడుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చిన్న పిల్లవాడు క్లాస్‌లో కూర్చొని కునుకు తీస్తుండగా, మిగిలిన పిల్లలు బిగ్గరగా చదువుతున్నారు. చాలా మంది పిల్లలు క్లాస్ రూమ్ లో కూర్చుని.. తమ టీచర్ చెబుతున్న ‘ఎ ఫర్ యాపిల్ , బి ఫర్ బాల్’ ని వల్లెవేస్తున్నారు. టీచర్ చెబుతున్న పాఠాలను స్టూడెంట్స్  అనుసరిస్తూ బిగ్గరగా పునరావృతం చేస్తున్నారు. అయితే ఇదేమీ నాకు సంబంధం లేదు అన్నట్లు.. తరగతి గతిలో ఒక పిల్లవాడు నిద్రపోవడంలో బిజీగా ఉన్నాడు. టీచర్ చెబుతున్న పాఠం తనకు అమ్మపాడిన లాలి పాట అనుకున్నాడేమో ఆ చిన్నారి బాలుడు హ్యాపీగా కునుకు తీస్తున్నాడు. అలా నిద్రపోతూ ఉగిపోతూనే ఉన్నాడు. చాలా సార్లు పడిపోకుండా తప్పించుకున్నాడు.  వీడియో చివరలో స్టూడెంట్ నిద్రపోతున్నప్పుడు వెనుకకు జరిగి.. అక్కడ పడిపోయాడు. బాలుడు నిద్ర పోవడం కోసం పడిన తిప్పలు ఎవరో కెమెరాలో బంధించారు. మిగిలిన స్టూడెంట్స్ నవ్వారు.

ఇవి కూడా చదవండి

మీ బాల్యం కనులముందుకు తెచ్చే వీడియో

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Gulzar_sahab అనే IDతో షేర్ చేశారు. ఎవరి బాల్యం ఇది అనే  ఫన్నీక్యాప్షన్‌తో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కేవలం 57 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 39 వేలకు పైగా వీక్షించగా, 2300 మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఈ పిల్లవాడు కచ్చితంగా ఐఏఎస్ అవుతాడని ఎవరోకామెంట్ చేస్తే.. ‘టాపిక్ అర్థం కాకపోతే ఇలాగే జరుగుతుంది’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్