Leopard rescue: ఓ చిరుత పాఠశాలలోకి ప్రవేశించి వాష్‌రూమ్‌లో చిక్కుకుపోయింది. దాన్ని చూసిన వాచ్‌మెన్ గజగజ వణుకుతూ.. మరుగుదొడ్డికి గొళ్లెం పెట్టి అటవీ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం హుటాహుటిన వచ్చిన అధికారులు.. మూడు గంటలపాటు శ్రమించి దాన్ని రక్షించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ముంబయిలోని గోరేగావ్‌లో జరగగా.. ప్రస్తుతం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గురుగావ్ ఈస్ట్‌లోని బింబిసార్ నగర్‌లో ఉన్న బీఎంసీ పాఠశాలలో.. రాత్రి గేటు దూకి లోపలకు ప్రవేశించిన ఓ చిరుతపులి వాష్‌రూమ్‌లో చిక్కుకుపోయింది. దాన్ని చూసిన వాచ్‌మన్ గొళ్లెం వేసి.. అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే రంగలోకి దిగిన అటవీ సిబ్బంది సుమారు మూడు గంటలపాటు శ్రమించి చిరుతపులిని పట్టుకున్నారు. సురక్షితంగా అక్కడి నుంచి జూకి తరలించారు.
పాఠశాల సమీపంలో అడవులు ఉండటంతో సుమారు 3-4 ఏళ్ల మగ చిరుతపులి వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి అక్కడే చిక్కుకుపోయిందని అటవీ శాఖ అధికారి గిరిరాజ దేశాయ్ వెల్లడించారు. వాచ్‌మన్ ఇచ్చిన సమాచారంతో ముంబై అటవీ శాఖ సిబ్బంది, ఎన్‌జీఎన్‌పీ రెస్క్యూ టీమ్, వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. చిరుతపై ట్రాంక్వలైజర్ ఉపయోగించి, అది మత్తులోకి వెళ్లగానే సురక్షితంగా దాన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్కుకు తరలించినట్లు తెలిపారు. చిరుత కోలుకున్న వెంటనే అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది.
Mumbai
మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి