మెల్లగా వచ్చి.. ఒక్కసారిగా దూకి..

మెల్లగా వచ్చి.. ఒక్కసారిగా దూకి..

అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత కంట.. ఇంటి మెట్ల వద్ద నిద్రపోతోన్న ఓ కుక్క కనిపించింది. దీంతో ఆహారం దొరికిందని సంతోషపడ్డ  ఆ చిరుత.. ఎలాంటి శబ్దం చేయకుండా కుక్క దగ్గరగా వచ్చింది. వెంటనే దాని పీకను పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోపే కుక్క అప్రమత్తమైంది. తన పీక కొరికేందుకు యత్నించిన చిరుతకు ఝలక్ ఇఛ్చి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. అయితే వెంటనే ఆ చిరుత కూడా కుక్క వెంట […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Oct 15, 2019 | 7:45 PM

అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత కంట.. ఇంటి మెట్ల వద్ద నిద్రపోతోన్న ఓ కుక్క కనిపించింది. దీంతో ఆహారం దొరికిందని సంతోషపడ్డ  ఆ చిరుత.. ఎలాంటి శబ్దం చేయకుండా కుక్క దగ్గరగా వచ్చింది. వెంటనే దాని పీకను పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోపే కుక్క అప్రమత్తమైంది. తన పీక కొరికేందుకు యత్నించిన చిరుతకు ఝలక్ ఇఛ్చి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. అయితే వెంటనే ఆ చిరుత కూడా కుక్క వెంట పరుగుతీసింది. దీనికి సంబంధించిన వీడియో మొత్తం ఇంటి ముందరున్న సీసీ కెమెరాలో రికార్డు అవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కుక్క పారిపోయిన తర్వాత వీడియో పుటేజీ లేకపోవడంతో.. ఆ కుక్క ఎలా ఉంది..? ఎక్కడుంది..? చిరుత చేతిలో చిక్కుకుందా..? అనే విషయంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే గుజరాత్ లోని అమ్రేలిలో ఈ ఘటన జరిగింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu