Viral Video: జనారణ్యంలోకి చిరుతపులి.. రెస్క్యూ కోసం వెళ్లిన అధికారులపై దాడి.. చివరకు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

హర్యానాలోని పానిపట్ లోని బహరంపూర్ గ్రామంలో పులి సంచరిస్తున్నట్లుగా అధికారులకు సమాచారం వచ్చింది.

Viral Video: జనారణ్యంలోకి చిరుతపులి.. రెస్క్యూ కోసం వెళ్లిన అధికారులపై దాడి.. చివరకు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Viral Video
Follow us

|

Updated on: May 09, 2022 | 11:05 AM

గత కొద్ది రోజులుగా అడవిలో ఉండాల్సిన జంతువులు జనార్యణంలోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఏనుగులు, ఎలుగుబంట్లు, కోతులు, జింకలు మాత్రమే కాకుండా.. అడవికి రాజైన సింహాలు, చిరుతపులులు సైతం జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. అన్ని ప్రదేశాల్లోకి చిరుతలు, పులులు, సింహాలు వస్తున్న సంఘటనలు చూస్తున్నాము.. గతంలో హైదరాబాద్‏లో చిరుత పులి సంచరించిన సంగతి తెలిసిందే. తాజాగా జనారణ్యంలోకి వచ్చిన ఓ పులి… అక్కడే డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ పోలీసులపై దాడి చేసింది. పోలీసులు సైతం భయపడిపోకుండా.. ధైర్యంగా పులితో పోరాడి ప్రాణాలను దక్కించుకున్నారు. పులికి దాడికి సంబంధించిన వీడియోను పానిపట్ సూపరింటెండెంట్.. శశాంక్ కుమార్ సావన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

అసలు విషయానికి వస్తే.. హర్యానాలోని పానిపట్ లోని బహరంపూర్ గ్రామంలో పులి సంచరిస్తున్నట్లుగా అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న రోడ్డుపై వారి కారును పార్క్ చేయగా.. ఆకస్మాత్తుగా వారిపై చిరుతపులి దాడి చేసింది. ఓ అధికారిపై చిరుతపులి దాడి చేయగా.. అక్కడే ఉన్న మరో అధికారి వెంటనే పరిగెత్తి ఆ చిరుతపులి పక్కకు పడేసాడు.. దీంతో వెంటనే అతడిపై దాడి చేసింది. అంతలోనే అక్కడే ఉన్న మరికొందరు అధికారులు చిరుత దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. చివరకు చిరుతపులికి స్పృహ కోల్పోయేలా చేసి దానిని బంధించారు.. ఈ ఘటనంలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఐపీఎస్ శశాంక్ కుమార్ సావన్ మే 8న తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. అటవి శాఖ అధికారులకు కఠినమైన రోజు .. వారి ధైర్యానికి వందనం. చివరకు చిరుతతోపాటు.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని మకరందం..

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?