Viral Video: డబ్బులు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్తే ఊహించని షాక్.. భయంతో పరుగులు పెట్టిన జనం..

వన్య ప్రాణులు జనావాసంలోకి రావడం కొత్తేమీకాదు. చాలా జంతువులు మనుషుల మధ్య కు వచ్చి భయపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.

Viral Video: డబ్బులు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్తే ఊహించని షాక్.. భయంతో పరుగులు పెట్టిన జనం..
Atm
Follow us

|

Updated on: Mar 09, 2022 | 8:50 AM

Viral Video: వన్య ప్రాణులు జనావాసంలోకి రావడం కొత్తేమీకాదు. చాలా జంతువులు మనుషుల మధ్య కు వచ్చి భయపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో అయితే చాలా జంతువులు రోడ్లపైకి వచ్చి మరి స్వేచ్ఛగా తిరిగాయి. వన్య ప్రాణులు వీధుల్లోకి.. ఇళ్లలోకి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొట్టాయి. ఇలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సహజంగా మనకు ఎక్కువ కనిపించే వాటిలో పాము కూడా ఒకటి. చాలా మంది తమ ఇంట్లోకి పాము దూరిందని స్నేక్ క్యాచర్స్ కు ఫోన్ లు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక పాము ఏకంగా ఏటీఎం కే వచ్చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు డ్రా చేద్దామని వెల్లిని జనాలు ఉలిక్కి పడ్డారు. కార్డు పెట్టి పిన్ నెంబర్ నొక్కితే డబ్బులొస్తాయి అనుకుంటే ఊహించని విధంగా ఓ భారీ నాగు పాము వచ్చింది. ఓ భారీ నాగు పాము బుసలు కొడుతూ పడగా విప్పి ఏటీఎం మిషన్ పైన కనిపించింది. దాంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు స్నేక్ క్యాచర్స్ కు ఫోన్ కొట్టారు. అది గమనించినట్టు ఉంది వెంటనే ఆ ఏటీఎం మిషన్ కు ఉన్న ఓ రంద్రం నుంచిమిషన్ లోపలి దూరేసింది ఆ భారీ త్రాచు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోవింద్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. ATM వద్ద పెద్ద పాము ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో  విస్తృతంగా ప్రచారం అయ్యింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పామును రక్షించారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..

Viral Video: పెళ్లి పీటల మీద సడెన్ ట్విస్ట్ ఇచ్చిన వరుడు.. బిత్తరపోయిన కుటుంబసభ్యులు.. అసలేమైందంటే

Priyanka Jawalkar: కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ముద్దుగుమ్మ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)