Viral Video: షూ వేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. లోపల కనిపించిన సీన్ చూసి ఖంగుతిన్నాడు..

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బొమ్మకట్టే గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం పాము కనిపించింది.

Viral Video: షూ వేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. లోపల కనిపించిన సీన్ చూసి ఖంగుతిన్నాడు..
Viral 3
Follow us

|

Updated on: Aug 03, 2022 | 1:09 PM

వర్షకాలంలో మొదలైంది పాములు, తేళ్లు ఇంటి పరిసరాల్లోకి వచ్చేస్తుంటాయి. చిన్న చిన్న పొదల చాటున పెను ప్రమాదమే దాగి ఉంటుంది. అందుకే వర్షకాలంలో రోడ్డుపై వెళ్లేవారు.. పంటపొలాల్లోకి వెళ్లేవారు.. ఇంటి చుట్టూ నిర్మాణుష్యంగా ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఎక్కువ రోజులు ఓకే చోట నిలువ చేసిన వస్తువులను కదిలించే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా రోజులుగా ఓకే చోట ఉన్న వస్తువులలో పాములు ఉండే అవకాశం ఉంటుంది. కానీ రోజూ ఉపయోగించే షూలను కూడా మరింత జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇప్పటివరకు షూలలో తేళ్లు.. విషపూరితమైన పురుగులు చేరడం చూసి ఉంటారు. కానీ అతి పెద్ద నాగుపాము షూలోకి చేరడం ఎప్పుడైనా చూశారా ?. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బుసలు కొడుతూ కోపంగా ఉండే నాగుపాము ఓ షూలో దూరింది.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బొమ్మకట్టే గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం పాము కనిపించింది. షూ వేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తి లోపల కనిపించిన సీన్ చూసి గుండె ఆగినంత పనయ్యింది. అతని షూలో పెద్ద నాగుపాము చూసి షాకయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కిరణ్ అనే స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేసి పిలిపించారు. అతను వచ్చి షూలోంచి నాగుపాము జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం ఆ పామును అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.