Bride and Groom: పెళ్లికి ముందే వరుడు, వధువు మధ్య ఒప్పందం.. రాత్రి ఆ సమయం వరకూ..

భార్య భర్తల మధ్య సవాలక్ష అంశాలుంటాయి. అలకలు, బుజ్జగింపులు, కోపాలు, కొట్లాటలు, ఆ వెంటనే సంతోషాలు అన్నీ కలగలిసినదే భార్యభర్తల బంధం.

Bride and Groom: పెళ్లికి ముందే వరుడు, వధువు మధ్య ఒప్పందం.. రాత్రి ఆ సమయం వరకూ..
Kerala Couple Agreement
Follow us

|

Updated on: Nov 12, 2022 | 3:55 PM

భార్య భర్తల మధ్య సవాలక్ష అంశాలుంటాయి. అలకలు, బుజ్జగింపులు, కోపాలు, కొట్లాటలు, ఆ వెంటనే సంతోషాలు అన్నీ కలగలిసినదే భార్యభర్తల బంధం. అయితే, ఈ మధ్య కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి తరువాత ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే ఒప్పందానికి వస్తున్నారు. ఇక పెళ్లి అంటే అబ్బాయిలు, అమ్మాయిల్లో ఒక రకమైన భావన ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిల్లో పెళ్లి తరువాత తమకు ఫ్రీడమ్ ఉండదని, భార్యలు వేయించుకు తింటారని వారి భావన. ముఖ్యంగా స్నేహితులతో సంబంధాలు తెగిపోతాయని అంతా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఓ జంట ట్రెండింగ్‌లోకి వచ్చింది. పెళ్లి సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందం సంచలనం క్రియేట్ చేస్తుంది. అవును, కేరళకు ఓ వధువు.. తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడిపేందుకు అంగీరిస్తానని, ఆ సమయంలో అతనికి ఫోన్ కాల్స్ చేయనని ఒప్పంద పత్రంపై సంతకం చేసింది. ఉత్తిత్తి సంతకం కాదండోయ్.. 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఒప్పంద నియమాలు రాసి మరీ సంతకాలు చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన అర్చన, రఘు ఇద్దరూ నవంబర్ 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లి సందర్భంగా వీరిద్దరి మధ్య కీలక ఒప్పందం జరిగింది. పెళ్లి అయిన తరువాత కూడా తన భర్త రఘు అతని స్నేహితులతో రాత్రి 9 గంటల వరకు తిరగేందుకు ఎలాంటి అభ్యంతరం తెలుపకూడదు. ఆ సమయంలో ఆమె తన భర్తకు ఎలాంటి ఫోన్ కాల్స్ చేసి డిస్ట్రబ్ చేయొద్దు. ఇదీ వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందం. నవంబర్ 5వ తేదీన వీరిద్దరూ 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసుకోని సంతకాలు చేసుకున్నారు. ఈ బాండ్ పేపర్‌పై సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు.

నవంబరు 5న పాలక్కాడ్‌లోని కంజికోడ్‌లో ఈ జంట వివాహం జరిగింది. రఘు స్నేహితులు వధువు అర్చనకు కాంట్రాక్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్‌కు సంబంధించిన డాక్యూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇలాంటి ఘటనలు దేశంలో ఇటీవలి కాలంలో చాలానే జరిగాయి. నెలకు ఒక పిజ్జా తినిపించాలని, మిగతా రోజుల్లో కేవలం ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని, ప్రతి రోజూ చీరను ధరించాలి, అర్థరాత్రి వరకు పార్టీలు బంద్, ప్రతి రోజూ జిమ్‌కు వెళ్లడం, ప్రతి 15 రోజులకు ఒకసారి షాపింగ్ చేయడం వంటి చిత్ర విచిత్రమైన ఒప్పందాలు ఇటీవలి కాలంలో పలువురు జంటల మధ్య జరిగాయి. ఇందుకు సంబంధించిన అగ్రీమెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!