Samosa stall: రైల్వే స్టేషన్‌లో ఫుడ్ స్టాల్‌లో రైల్వే బృందం తనిఖీలు.. సమోసా 8గ్రా. బరువు తక్కువ ఉందని సీజ్

కొన్నిసార్లు ఈ దుకాణదారులు మోసం చేసి.. అధికారులకు చిక్కుతారు. తాజాగా కాన్పూర్ నుంచి ఇలాంటి ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ విషయం తెలిస్తే.. రైల్వే స్టేషన్ లో మరే ఇతర దుకాణదారుడు మోసం చేయడానికి ప్రయత్నించడు.

Samosa stall: రైల్వే స్టేషన్‌లో ఫుడ్ స్టాల్‌లో రైల్వే బృందం తనిఖీలు.. సమోసా 8గ్రా. బరువు తక్కువ ఉందని సీజ్
Kanpur Central Station Samo
Follow us

|

Updated on: Jun 26, 2022 | 3:53 PM

Railway Station Samosa Stall: తరచుగా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే స్టేషన్ స్టాల్‌ను ఏర్పాటు చేసే దుకాణదారుడు తన కస్టమర్‌లను మోసం చేయడం తరచుగా చూస్తూనే ఉంటారు.. ఇలా రైల్వే స్టేషన్ లో ఆహార పదార్ధాల విషయంలో ఎక్కువగా మోసపోయేది.. ప్రయాణిలు.. ఇలాంటి ప్రయాణీకులు ఒకటి రెండు సార్లు మాత్రమే ప్రయాణం చేస్తారు.. అందుకనే తమను మోసం చేసే దుకాణదారులు పెద్దగా పట్టించుకోరు. అందుకనే తమ కస్టమర్‌లను రైల్వే స్టేషన్ లో ఫుడ్ అమ్మేవారు మోసం చేయడానికి ఇదే కారణంగా భావించవచ్చు. అయితే కొన్నిసార్లు ఈ దుకాణదారులు మోసం చేసి.. అధికారులకు చిక్కుతారు. తాజాగా  కాన్పూర్ నుంచి ఇలాంటి ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ విషయం తెలిస్తే.. రైల్వే స్టేషన్ లో మరే ఇతర దుకాణదారుడు మోసం చేయడానికి ప్రయత్నించడు. వివరాల్లోకి వెళ్తే..

కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 5. ఇక్కడ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న స్టాళ్లపై రైల్వే అధికారుల బృందం నిఘాను ఏర్పాటు చేసింది. దుకాణదారులు చేస్తున్న మోసాన్ని కనిపెట్టింది. ఈ  తనిఖీలో సమోసా బరువు ఎనిమిది గ్రాములు తక్కువగా ఉన్నదని  రైల్వే అధికారుల బృందం బృందం కనిపెట్టింది. దీంతో తనిఖీ బృందం వెంటనే ఆ స్టాల్‌ను సీజ్ చేశారు. సమోసాల బరువు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా 42 గ్రాములు ఉన్నందున దుకాణానికి సీల్‌ వేసినట్లు తనిఖీ బృందం తెలిపింది.

ఈ నివేదికను అధికారులు రైల్వే బోర్డుకు పంపారు. దీంతో ఆ ఫుడ్ స్టాల్ నిర్వాహకుడు.. సమోసాను తయారు చేసిన అనంతరం.. నూనెలో వేయించిన అనంతరం.. మైదా తేమ తగ్గిపోవడం వలన సమోసా తేలికగా మారుతుందని చెప్పాడు. స్టాల్ నిర్వాహకుడి అభిప్రాయాన్ని రైల్వే అధికారులు విన్న తరవాత.. స్టేషన్ లో దుకాణాన్ని తెరవడానికి అనుమతించారు.  సమోసా బరువు 45 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలని కూడా ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా రైల్వే స్టేషన్ లో స్టాల్స్ లోని పుడ్ పై గత పదేళ్లలో మొదటిసారిగా సమోసాను తూకం వేసిన తర్వాత చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల అభిప్రాయం మేరకు స్టేషన్‌లో చాట్-డిష్ అందుబాటులో ఉంచాలని ఇటీవల నిర్ణయించారు. వాస్తవానికి.. వివిధ జిల్లాల నుండి వేర్వేరు ఆహారాన్ని పదార్ధాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు తమ ఫీడ్‌బ్యాక్‌లో తెలిపారు. ఈ తనిఖీల అనంతరం.. ఉత్తర మధ్య రైల్వే ప్రతి రూట్‌లో సర్వే  చేసే సమోసాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెకింగ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..