అమ్మ కడుపులో కవలల బాక్సింగ్.. చూడాల్సిందే

అమ్మ కడుపులో ప్రశాంతంగా ఉండాల్సిన కవలలు రెచ్చిపోయారు. బయటకు రాకముందే తమ అల్లరికి పనిచెప్పారు. గర్భంలో ఉండగానే కవలలైన అమ్మాయిలిద్దరు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అరుదైన ఈ దృశ్యాన్ని వారి తండ్రి ముచ్చటపడుతూనే వీడియో తీసి విడుదల చేశాడు. చైనాలో నివసించే టోయ్ అనే వ్యక్తి తన భార్యకు నాలుగు నెలలు ఉన్నప్పుడు స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. స్కానింగ్ చేసే సమయంలో ఆ కవలలు భార్య గర్భంలో ఏం చేస్తున్నారో వీడియో తీశాడు. అందులో […]

అమ్మ కడుపులో కవలల బాక్సింగ్.. చూడాల్సిందే
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2019 | 8:08 PM

అమ్మ కడుపులో ప్రశాంతంగా ఉండాల్సిన కవలలు రెచ్చిపోయారు. బయటకు రాకముందే తమ అల్లరికి పనిచెప్పారు. గర్భంలో ఉండగానే కవలలైన అమ్మాయిలిద్దరు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అరుదైన ఈ దృశ్యాన్ని వారి తండ్రి ముచ్చటపడుతూనే వీడియో తీసి విడుదల చేశాడు.

చైనాలో నివసించే టోయ్ అనే వ్యక్తి తన భార్యకు నాలుగు నెలలు ఉన్నప్పుడు స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. స్కానింగ్ చేసే సమయంలో ఆ కవలలు భార్య గర్భంలో ఏం చేస్తున్నారో వీడియో తీశాడు. అందులో కవలలు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. టోయ్ తీసిన ఈ వీడియోకు వచ్చిన లైక్స్, కామెంట్లకు అంతేలేదు. 2.5మిలియన్ లైక్స్, 80వేల కామెంట్లతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోసారి స్కానింగ్‌కు వెళ్లినప్పుడు ఒకరి కౌగిళిలో మరొకరు ఒదిగిపోయి కళ్లకు మరింత కనువిందు చేశారని వారి తండ్రి సంతోషంతో పొంగిపోతూ చెప్పాడు. తల్లి కడుపు నుంచి బయటపడకముందే వారి మధ్య అనుబంధానికి ఇది నిదర్శనమని టోయ్ అంటున్నాడు.

మోమో ట్విన్స్‌గా వ్యవహరించే ఈ కవలల్లో 26వారాల తరువాత 50శాతం మాత్రమే బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినప్పటికీ.. ఈ పిడుగులిద్దరూ దాన్ని పూర్తిగా మార్చేశారు. 32వారాల తరువాత ఏప్రిల్ 8న పుట్టిన ఈ చిన్నారులిద్దరూ ఆరోగ్యంగా, చలాకీగా ఉండటం డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. వీరి తల్లి వీరిద్దరికి ముద్దుగా తనకు ఇష్టమైన పండ్లు చెర్రీ, స్ట్రాబెర్రీ పేర్లనే పెట్టుకుంటూ అపురూపంగా చూసుకుంటోంది. మొత్తానికి ఈ కవలల కథ సుఖాంతం కావడం వైద్యశాస్త్ర చరిత్రనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కాగా ఈ పిల్లలు తాజా ఫొటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు