Viral Video: అర్ధరాత్రి ఆకాశంలో అద్భుతం.. నేలవైపు దూసుకొచ్చిన ఉల్కాపాతం.. చూసేందుకు ఎంత బాగుందో..

అర్ధరాత్రి ఆకాశంలో అద్భుతం జరిగింది. నింగి నుంచి అగ్నిగోళం నేలరాలుతుందా అన్నట్టుగా ఉల్కా పాతం భూమివైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో నగరమంతా వెలుగులతో నిండిపోయింది.

Viral Video: అర్ధరాత్రి ఆకాశంలో అద్భుతం.. నేలవైపు దూసుకొచ్చిన ఉల్కాపాతం.. చూసేందుకు ఎంత బాగుందో..
Viral
Follow us

|

Updated on: Jul 11, 2022 | 4:21 PM

అర్ధరాత్రి ఆకాశం పూర్తిగా నల్లటి దుప్పటి కప్పుకున్నట్లుగా ఉంది. నగరమంతా విద్యుత్ వెలుగులతో నిండిపోయింది. ఆకస్మాత్తుగా ఆ అర్ధరాత్రి ఆకాశంలో అద్భుతం జరిగింది. నింగి నుంచి అగ్నిగోళం నేలరాలుతుందా అన్నట్టుగా ఉల్కా పాతం భూమివైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో నగరమంతా వెలుగులతో నిండిపోయింది. ఖగోళంలో జరిగే ఈ అద్భుత దృశ్యం కెమెరాలో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఉల్క సౌరమండలంలో ఓ శిథిల పదార్థమ‌ని, ఉల్కాపాతంలో చిన్నముక్క మండి భూమిపైకి దూసుకొచ్చిన‌ట్లు కన్సెప్సియన్ విశ్వవిద్యాలయం ప‌రిశోధ‌కులు ధ్రువీక‌రించారు. ఈ అద్భుత ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో జరిగింది.

శాంటియాగోలోని పలు ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఈ ఉల్కా పాతం కదలికలు కెమెరాలో స్పష్టంగా కనిపించాయి. అండీస్ ప్రాంతంలో అదృశ్యమయ్యే ముందు ఉల్కాపాతం అనేక భాగాలుగా విడిపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, ఈ ఉల్కను ‘టీ12సీఎల్’గా పిలుస్తార‌ని చిలీ ఆస్ట్రానమీ ఫౌండేషన్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ బీమిన్ వెల్లడించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో వేలాది వ్యూస్‌తో వైరల్ అవుతోంది. ఉల్కాపాతం ఆకాశాన్ని దాటి నగరాన్ని భారీ ఫ్లాష్‌లైట్‌గా వెలిగించడం చూసి నెటిజన్లు మైమరిచిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.