Viral Video: ఊరెళ్లిన యజమానిపై బెంగతో.. .కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. ఇది కదా విశ్వాసం అంటే..

Viral Video: పెంపుడు జంతువులు(Pet Animals) ఎన్ని ఉన్నా.. కుక్కది మాత్రం ప్రత్యేక స్థానం. కుక్కలు విశ్వాసానికి మారుపేరు. తమ యజమాని పట్ల కుక్కకు చూపించే విశ్వాసం.. వారి సంతానం కూడా చూపించదేమో..

Viral Video: ఊరెళ్లిన యజమానిపై బెంగతో.. .కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. ఇది కదా విశ్వాసం అంటే..
Viral Video
Follow us

|

Updated on: Apr 10, 2022 | 12:06 PM

Viral Video: పెంపుడు జంతువులు(Pet Animals) ఎన్ని ఉన్నా.. కుక్కది మాత్రం ప్రత్యేక స్థానం. కుక్కలు విశ్వాసానికి మారుపేరు. తమ యజమాని పట్ల కుక్కకు చూపించే విశ్వాసం.. వారి సంతానం కూడా చూపించదేమో అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.. అందుకే చాలామంది కుక్కల‌ను పెంచుకుంటారు. వాటిపై ఎన‌లేని ప్రేమ చూపుతారు. క‌న్నబిడ్డల్లా చూసుకుంటారు. కుక్కలు కూడా య‌జ‌మానిపై ఎన‌లేని విశ్వాసం, ప్రేమ‌ను చూపిస్తుంటాయి. య‌జ‌మాని ఇల్లు వదిలి బయటకు వెళ్లినప్పుడు అతను తిరిగి వచ్చేవరకు గుమ్మం వైపు చూస్తూ ఉంటాయి. తమలో తామే మదనపడుతుంటాయి. సరిగ్గా దీనికి అద్దం పట్టే ఘటన ఈ వీడియో గురించి ఇపుడు తెలుసుకుందాం.. ఓ య‌జ‌మాని ఏదో పనిమీద ఊరెళ్లగా పెంపుడు కుక్క చేసిన ప‌ని నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంది.

ఓ ఇంటి య‌జ‌మాని ఊరెళ్లాడు. ఆ ఇంట్లో కుక్క ఒంటిరిగా ఉంది. య‌జ‌మాని తనతో లేకపోవడంతో ఆకుక్క బెంగపడింది. పాపం పడుకుందామంటే దానికి నిద్ర కూడా రాలేదు.. చివ‌రికి తన య‌జ‌మాని షూను నోట‌క‌రుచుకుని వ‌చ్చి సోపాపైకి ఎక్కింది. అనంత‌రం ఆ చెప్పును ప‌క్కనే పెట్టుకుని ప‌డుకుంది. అలా య‌జ‌మాని త‌న ప‌క్కనే ఉన్నారన‌న్న భ‌రోసాతో నిద్రలోకి జారుకుంది. య‌జ‌మానిపై కుక్కకు ఉన్న ప్రేమ నెటిజ‌న్ల హృద‌యాల‌ను గెలుచుకుంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. లైక్స్‌తో కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read: Sri Rama Navami: కన్నుల పండువగా రాములోరి కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?