Longest Bicycle: పుర్రెకో బుద్ది..జిహ్వకో రుచి.. అన్నారు పెద్దలు. కొందరి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఇక ప్రపంచ రికార్డ్స్ పేరుతో ఖ్యాతి గాంచిన గిన్నిస్ రికార్డు (Guinness World Record) లకోసం అనేకమంది రకరకాల సాహసాలు.. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు పొందుతారు. అలా ఆడమ్ (Adam Zdanovich) అనే వ్యక్తి కూడా రికార్డు నెలకొల్పాలనుకున్నాడు. అందుకు అతను సైకిల్‌ను ఎంచుకున్నాడు. అందరూ తొక్కే మామూలు సైకిలును అతి ఎత్తయిన సైకిలుగా తయారు చేసి, దానిపై రైడ్ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. రీసైకిలింగ్ వస్తువులతో ఎత్తయిన సైకిలును రూపొందించాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సైకిల్ తయారీకి అతనికి నెల రోజులు సమయం పట్టిందట. ఈ సందర్భంగా ‘తనకెప్పడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని, తన ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు ఆడమ్ జ్ఞానోవిచ్. అయితే ఈ సైకిల్ 24 అడుగుల 3 అంగుళాలు ఉంటుందట. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ బుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడమ్ అతి పొడవైన సైకిల్ని రైడింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఆడమ్‌ని గొప్ప ఆవిష్కర్త అంటూ ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
Also Read: