Football Viral Video: అదృష్టం లేకుంటే.. ‘ఒంటె మీద కూర్చున్నా కుక్క కరుస్తుంది’ అనే మాటలు మీరు తరచుగా వినే ఉంటారు. అంటే.. దురదృష్టం వెంటాడుతుంటే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. నష్టంనుంచి తప్పించుకోలేం. ఆ నష్టం ఏ రూపంలో నైనా జరగవచ్చు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్ వేయండి.. ఇది ఫుట్‌బాల్ గేమ్‌కు సంబంధించినది. ఈ వీడియోలో బంతి ఆటగాడి ముఖాన్ని విపరీతంగా తాకింది. ఆ తర్వాత అలర్ట్ అవుతాడు. కానీ పదే పదే ఏదైనా జరిగితే దాన్ని యాదృచ్చికం అనలేం. ఇప్పుడు ఈ వీడియో చూసి జనాల నవ్వు తూ టెన్షన్ నుంచి రిలాక్స్ అయిపోవచ్చు. అంతేకాదు ఆటగాడి పరిస్థితి చూసి జాలి కలుగుతుంది.
ఈ వైరల్ వీడియోలో.. కొంతమంది ఆటగాళ్లు ఫుట్‌బాల్‌లో ఫ్రీ కిక్‌లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఒక వ్యక్తి ఫ్రీ కిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.. మరో 5 మంది ఆటగాళ్ళు ఫుట్‌బాల్ గోల్‌లోకి వెళ్లకుండా గోడలా నిలబడి ఉన్నారు. ఆటగాడు బంతిని కొట్టిన వెంటనే.. అది ఎడమవైపు నుండి నేరుగా సెకండ్ ప్లేస్ లో నిలబడి ఉన్న ఆటగాడి ముఖాన్ని తాకింది. దీంతో ఆ తాగాడు బాధతో విలవిలాడు.. మళ్ళీ ప్రీ క్రీక్ కొట్టడానికి ఆటగాడు రెడీ అవుతున్న సమయంలో సెకండ్ ప్లేస్ లో నిలుచుని దెబ్బ తగిలించుకున్న వ్యక్తి.. భయంతో తన ప్లేస్ మార్చుకున్నాడు. లైన్ లో చివర నిల్చున్న వ్యక్తిని తన ప్లేస్ లోకి రమ్మనమని చెప్పి.. తాను అతని స్థానంలో చివర నిల్చున్నాడు. అయితే ఇప్పటి షాట్ లో కూడా అతనికి దెబ్బ తగిలింది. అతను గాయపడ్డాడు. మళ్ళీ మూడో సారి.. ఫ్రీ క్లిక్ కు రెడీ అవుతున్న సమయంలో ఆ వ్యక్తి.. భయంతో షాట్ నుంచి తన ముఖాన్ని రక్షించుకోవడం కోసం వెనక్కి తిరిగి.. ఫ్రీ కిక్ కొట్టే వ్యక్తికీ నడుము కనిపించేలా నిలబడ్డాడు. అయితే ఆ తర్వాత ఏం జరుగిందో ఈ వీడియోలో మీరే చూడండి. నమ్మండి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు.. అంతేకాదు దురదృష్టం వెంటాడుతుంటే.. ఇలాగే జరుగుతుంది.. అని కామెంట్ చెయ్యకుండా ఉండలేరు..
There is both a comedy and pathos to bad luck…😀 pic.twitter.com/hANTu3stDH
— Harsh Goenka (@hvgoenka) June 20, 2022
ఈ వీడియో హాస్యాస్పదంగా అనిపించవచ్చు.. ఈ వీడియోను దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేశారు. అతను క్యాప్షన్‌లో రాశాడు.. ఇది ఫన్నీ , దురదృష్టం రెండింటినీ చూపిస్తుంది. ఇప్పటికే దాదాపు 50,000 మంది వీక్షించారు. వందల మంది వ్యక్తులు పోస్ట్‌ను లైక్ .. రీట్వీట్ చేసారు.
‘హే సర్జీ చాలా ఫన్నీగా ఉంది, సరదాగా ఉంది’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ఇది కెనడియన్ చిలిపి టీమ్ అని మరొక నెటిజన్ చెప్పారు. వీరి వీడియోలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయని ఒకరంటే.. ఈ వీడియో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుదీని అన్ని వైపుల నుండి కొడుతున్నట్లుంది మరొకరు కామెంట్ చేశారు. మొత్తంమీద పారిశ్రామికవేత్త గోయెంకా షేర్ చేసిని ఈ వీడియో నెటిజన్లని బాగా ఆకట్టుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..