Viral Photo: కిర్రాక్ పజిల్.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడ నక్కి ఉందో మీ పదునైన కళ్లతో కనిపెట్టండి..?

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే.. మరికొన్ని మన కళ్లను మోసం చేస్తుంటాయి. తాజాగా మీ కోసం ఓ క్లిష్టమైన పజిల్ తీసుకొచ్చాం.

Viral Photo: కిర్రాక్ పజిల్.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడ నక్కి ఉందో మీ పదునైన కళ్లతో కనిపెట్టండి..?
Find The Leopard
Follow us

|

Updated on: Jun 16, 2022 | 2:14 PM

Picture Puzzle: మీరు సోషల్ మీడియా(Social Media) అవే అండీ ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్(faceboook), స్నాప్ చాట్ వాడుతున్నారా..?.  అయితే ఈ మధ్య కాలంలో ఫోటో పజిల్స్ కూడా ఈ మధ్య మీ కంటపడే ఉంటాయ్. ఇవి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయ్. ఆప్టికల్ ఇల్యూజన్ అంటే.. ఇవి మీ కళ్లను మాయ చేస్తాయి. ఆట విడుపుగా ఉంటాయి. వీడని చిక్కుముళ్లుగా ఉండి మీతో ఒక ఆట ఆడుకుంటాయి. ఎంతసేపు చూసినా అందులో దాగి ఉన్నది కనిపించక కాస్తంత కోపాన్ని కలిగిస్తాయి. అయితే వాటిని సాల్వ్ చేస్తే మాత్రం.. సూపర్ కిక్ వస్తుంది. ఈ ఫోటో పజిల్స్ మీ చుపుల్లో ఎంత పదునుందో కూడా చెప్పేస్తాయ్. వీటిని సాల్వ్ చేయాలంటే కాస్త పేషెన్స్ అవసరం. మాకు అందులోని వస్తువు లేదా జంతువు దొరకడం లేదని వెంటనే సమాధానం చూసేస్తే.. అంత మజా ఉండదు. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో ఓ అటవీ ప్రాంతంలో తీసిందిగా అర్థమవుతుంది. అందులో ఒక చిరుత దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా టఫ్. మీ చూపుల్లోని పదును తెలుసుకోవడానికి కావాలనే ఫోటోను బ్లాక్ అండ్ వైట్ చేసి ఇచ్చాం. ఒకవేళ కొద్ది సెకన్లలోనే మీరు చిరుతను కనిపెడితే మీ కంటి చూపుల్లో తీక్షణత పుష్కలంగా ఉందనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. మా వల్ల కాదు అనిపిస్తే ఇక చేసేదేం లేదు కిందన చిరుత ఉన్న చోట సర్కిల్స్ చేసి ఉన్న ఫోటోను ఇచ్చాం. అక్కడ చెక్ చేయండి. ప్రజంట్ ఈ క్లిష్టమైన పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది.

Leopard

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి