Layoffs: ఉద్యోగం పోయిందని కుంగిపోలేదు.. గూగుల్ మాజీ ఉద్యోగుల నిర్ణయానికి ఫిదా.

|

Feb 22, 2023 | 11:08 AM

ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంలో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక మాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది...

Layoffs: ఉద్యోగం పోయిందని కుంగిపోలేదు.. గూగుల్ మాజీ ఉద్యోగుల నిర్ణయానికి ఫిదా.
Google Ex Employees
Follow us on

ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంలో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక మాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉన్నపలంగా ఉద్యోగం పోవడంతో ఎంతో మంది టెకీల జీవితాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయి. అప్పటి వరకు లక్షల జీతాలు తీసుకున్న వారు ఉద్యోగం కోల్పోవడంతో దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి కష్ట కాలాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించారు కొందరు ఉద్యోగులు.

తాము ఉద్యోగం కోల్పోయినా మరో నలుగురికి ఉద్యోగం కల్పించవచ్చని నిరూపించారు. అమెరికాలోకి గూగుల్ సంస్థలో పనిచేస్తున్న సీనియర్‌ మేనేజర్‌ హెన్రీ కిర్క్‌ను ఇటీవల గూగుల్‌ తొలగించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో చేపట్టిన లేఆఫ్స్‌లో హెన్రీ కూడా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే హెన్రీ నిరాశ చెందలేదు. ఉద్యోగం పోయిందే అని ఆందోళనపడలేదు. తన అపార అనుభవాన్ని నలుగురికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే ఏకంగా ఒక సంస్థను ఏర్పాటు స్థాపించాలనుకున్నాడు. హెన్రీతో పాటు మరికొందరు కలిసి న్యూయార్క్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలో డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్ స్టూడియోను ప్రారంభిస్తున్నారు.

ఇందులో భాగంగానే హెన్రీలాగే ఉద్యోగాలు కోల్పోయిన కొందరితో చేతులు కలిపాడు. హెన్రీకి కంపెనీ స్థాపనలో ఆయనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. తమ కొత్త ప్రయాణ విశేషాలను హెన్రీ కిర్క్‌ లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. దీంతో ఇప్పుడీ అంశం వైరల్‌గా మారింది. తన కొత్త కంపెనీ గురించి ప్రస్తావించిన హెన్రీ.. ‘కొత్త సంస్థ ఏర్పాటులో నాకు మీ సాయం కావాలి. కఠోర శ్రమ జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళుతుందని బలంగా విశ్వసిస్తాను. కానీ ఈ సందర్భం ఆ నమ్మకంపై సందేహాన్ని కలిగించవచ్చు. కానీ ఇలాంటి సవాళ్లు మనకు విభిన్నమైన అవకాశాలను కల్పిస్తాయని రాసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పనిచేయడం కఠినమైనదని, కానీ ఇది ఒక సవాల్‌ లాంటిదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..