Bangalore: కుక్కపై ఇంత క్రూరత్వమా? తమను చూసి మొరిగిందని.. ఈ మూర్ఖులు ఏం చేశారో తెలుసా?

ఇటీవల కొందరు కుక్కలపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక మహిళ పెంపుడు కుక్కను నేలకేసి కొట్టగా.. ఇటీవల ఒక డాక్టర్‌ కుక్క మెడకు తాడు కట్టి కారుతో ఈడ్చుకెళ్లాడు. తాజాగా అలాంటి దారుణ ఘటనే మరొకటి బెంగళూరులో చోటు చేసుకుంది.

Bangalore: కుక్కపై ఇంత క్రూరత్వమా? తమను చూసి మొరిగిందని.. ఈ మూర్ఖులు ఏం చేశారో తెలుసా?
Attack On Dog
Follow us

|

Updated on: Oct 05, 2022 | 7:31 AM

కుక్కలతో మనుషుల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో విశ్వాసంగా ఉండే ఈ మూగజీవాలను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు చాలామంది. వాటికి సకల సౌకర్యాలను సమకూరుస్తుంటారు. కుక్కలు కూడా అలాంటి యజమానుల పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి. అయితే ఇటీవల కొందరు కుక్కలపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక మహిళ పెంపుడు కుక్కను నేలకేసి కొట్టగా.. ఇటీవల ఒక డాక్టర్‌ కుక్క మెడకు తాడు కట్టి కారుతో ఈడ్చుకెళ్లాడు. తాజాగా అలాంటి దారుణ ఘటనే మరొకటి బెంగళూరులో చోటు చేసుకుంది.

చుట్టుపక్కల వాళ్లు వారించినా..

రోడ్డున పోతుంటే.. తమను చూసి మొరిగిందని ఓ శునకంపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు ఇద్దరు వ్యక్తులు. దాని మెడకు ఉన్న చెయిన్‌తో ముందరి కాళ్లను బంధించి.. దుడ్డు కర్రలతో చితకబాదారు. దెబ్బలు తాళలేక బాధతో అది మూలుగుతున్నా.. చుట్టు పక్కలవాళ్లు విడిపించేందుకు ప్రయత్నించినా.. ఆ మూర్ఖులు మాత్రం వినలేదు. చివరకు ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన వారిని సైతం పక్కకు తోసేసి మరీ మూగజీవిపై దాడి చేశారు. ఇంతలో యజమాని అక్కడికి చేరుకుని వారిని నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

ఈస్ట్‌ బెంగళూరు కేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మంజునాథ లేఅవుట్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ శునకాన్ని.. ఓనర్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ఆధారంగానే కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించుకున్నారు. యజమాని కూడా కుక్కపై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీడియో వైరల్‌ కావడంతో జంతుప్రేమికులు తెగ మండిపడుతున్నారు. అసలు వాళ్లు మనుషులేనా? మూగజీవిని అలా కొట్టడానికి చేతులెలావచ్చాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు