Viral Video: ర్యాప్ సాంగ్‌కు బామ్మ కళ్ళుచెదిరే స్టెప్పులు.. నెటిజన్లు షాక్.. వైరల్ అవుతున్న వీడియో.!

ఓ బామ్మ మాత్రం కరోనా, గిరోనా జాన్తా నహీ అంటూ తన డ్యాన్స్‌ స్టెపులతో ఇరగదీసింది. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది....

Viral Video: ర్యాప్ సాంగ్‌కు బామ్మ కళ్ళుచెదిరే స్టెప్పులు.. నెటిజన్లు షాక్.. వైరల్ అవుతున్న వీడియో.!
Follow us

|

Updated on: May 08, 2021 | 4:11 PM

Desi Dadi Viral Video: కరోనా సృష్టిస్తోన్న కల్లోలంకు.. యావత్‌ దేశ ప్రజానికం అయోమయంలో పడిపోయింది. దిక్కుతోచని స్థితిలో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏ మూల నుంచి ఏ మహమ్మారి ముంచుకొస్తుందోనని.. జనం భయపడిపోతున్నారు. కానీ.. ఓ బామ్మ మాత్రం కరోనా, గిరోనా జాన్తా నహీ అంటూ తన డ్యాన్స్‌ స్టెపులతో ఇరగదీసింది. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇక బామ్మ ఎనర్జీ లెవల్స్‌ చూసిన నెటిజన్స్‌కు దిమ్మతిరిగిపోతుంది. వామ్మో ఏంటా స్టెప్పులు బామ్మా.! లారెన్స్‌ను మించి పోయావ్‌గా..! అంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తూ వీడియోను మరింత వైరల్‌ చేస్తున్నారు. ఓ పెళ్లికి హాజరైన 70ఏళ్ల బామ్మ.. స్పానిష్‌లోని పాపిచు ర్యాప్ సాంగ్‌ స్టార్ట్‌ కాగానే.. పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది. పాట స్పానిష్‌ అయినా.. ఆ సాంగ్‌కు తగ్గట్లు డ్యాన్స్‌ చేసి మతిపోగొట్టింది.

రాజస్తాన్‌లోని ఓ చిన్న గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పాపిచు అనే ఈ స్పానిష్‌ సాంగ్‌ 2003లో పనామేనియన్‌ రాపర్‌ లోర్నా తొలిసారి విడుదల చేశాడు. ఇక సాంగ్‌ వరల్డ్‌ వైడ్‌గా ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఇవీ చదవండి:

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!