Viral Video: గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క పిల్లి.. కాళ్లతో సాయం చేసిన పిల్లి.. వీడియోకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Viral: ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది తమ తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటారు. కుక్కలు, పిల్లులు తప్పనిసరిగా చాలా మంది ఇళ్లలో ఉంటాయి.

Viral Video: గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క పిల్లి.. కాళ్లతో సాయం చేసిన పిల్లి.. వీడియోకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Cat And Dog
Follow us

|

Updated on: Sep 15, 2022 | 6:37 AM

Viral: ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది తమ తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటారు. కుక్కలు, పిల్లులు తప్పనిసరిగా చాలా మంది ఇళ్లలో ఉంటాయి. వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు కాపలా మాత్రమే కాకుండా.. కామెడీని కూడా పండిస్తుంటాయి పలు సందర్భాల్లో. పిల్లి, కుక్క కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. వాటి అల్లరి చేష్టలు చూసి నవ్వుకుండా ఉండలేరు. జాతుల పరుంగా రెండూ బద్ద శత్రువులు అయినప్పటికీ.. వాటి మధ్య స్నేహం ఏర్పడితే మాత్రం.. ఆ బంధం వేరే లేవల్‌లో ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచంలో అత్యంత మధురమైనది స్నేహం. మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా సన్నిహిత స్నేహం ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కుక్క, పిల్లి స్నేహం అబ్బురపరుస్తోంది. ఇందులో ఓ కుక్క పిల్ల తన స్నేహితుడైన పిల్లిని వెళ్తుంది. అయితే, రెండింటి మధ్య గ్రిల్స్ అడ్డుగా ఉన్నాయి. దాంతో ఆ కుక్క పిల్ల గ్రిల్స్ దాటేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ గ్రిల్స్ మధ్యలో కుక్క పిల్ల కాళ్లు ఇరుక్కుపోయాయి. వెంటనే అలర్ట్ పిల్లి.. తన ఫ్రెండ్‌ను గ్రిల్స్ మధ్య నుంచి తీసేందుకు సహాయం చేసింది. వెనుక కాళ్లు గ్రిల్స్ మధ్య ఇరుక్కోగా.. తన కాళ్ల సాయంతో ఆ కుక్క పిల్లను ముందుకు నెట్టే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. అందమైన స్నేహం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..