Viral News: కేక్‌పై రాతలు చూసి కంగుతిన్న కస్టమర్.. విషయం తెలిస్తే మీరూ నవ్వు ఆపుకోలేరు..

Viral News: తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు కోపాన్ని తెప్పించినా, అప్పుడప్పుడు మాత్రం నవ్వులు తెప్పిస్తుంటాయి. మనం ఒక ఉద్దేశంతో చెప్పిన విషయాన్ని అవతలి వారు మరో రకంగా అర్థం చేసుకోవడం, అందుకు తమకు తోచిన విధంగా...

Viral News: కేక్‌పై రాతలు చూసి కంగుతిన్న కస్టమర్.. విషయం తెలిస్తే మీరూ నవ్వు ఆపుకోలేరు..
Follow us

|

Updated on: May 21, 2022 | 5:32 PM

Viral News: తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు కోపాన్ని తెప్పించినా, అప్పుడప్పుడు మాత్రం నవ్వులు తెప్పిస్తుంటాయి. మనం ఒక ఉద్దేశంతో చెప్పిన విషయాన్ని అవతలి వారు మరో రకంగా అర్థం చేసుకోవడం, అందుకు తమకు తోచిన విధంగా స్పందించడం కామెడీగా ఉంటాయి. ఇలాంటి ఫన్నీ విషయాలను ఈ మధ్య సోషల్‌ మీడియాలో (Social Media) షేర్ చేసుకోవడం ఎక్కువవుతోంది. తమకు ఎదురైన విచిత్ర అనుభూతులను ఇతరులతో పంచుకుంటున్నారు నెటిజన్లు. తాజాగా ఇలాంటి ఫన్నీ సంఘటనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏదో పార్టీ నిమిత్తం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరి యాప్‌లో కేక్‌ను ఆర్డర్‌ చేశాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ బేకరీలో సదరు వ్యక్తి కేక్‌ను ఆర్డర్‌ చేశాడు. అదే సమయంలో కేక్‌ ఆర్డర్‌ చేసే ముందు బేకరీ నిర్వాహకులకు ఓ సందేశాన్ని పంపించాడు. ‘ఒకవేళ కేక్‌ తయారీలో కోడి గుడ్డును వినియోగిస్తే తెలిజేయండి’ అంటూ తెలిపాడు. తీరా ఇంటికి వచ్చిన కేక్ బాక్స్‌ విప్పి చూసిన సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ అతన్ని అంతలా షాక్‌కి గురి చేసిన అంశం ఏంటనేగా మీ సందేహం. కేక్‌పై.. ‘ఇందులో ఎగ్‌ కలిసి ఉంది’ అన్న రాతలను చూసిన వ్యక్తి నోట మాట రాలేదు. మొదట్లో బేకరీ నిర్వాహకులపై కోపం వచ్చినా, తర్వాత అది చూసి తనలో తానే నవ్వుకున్నాడు. వెంటనే ఆ కేక్‌ను ఫొటో తీసి, తనకు ఎదురైన ఈ ఫన్నీ సంఘటనను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఈ ఫొటో చూసిన వారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..