Viral Video: సోషల్ మీడియాలో అదరగొడుతున్న బ్యాండ్ బ్యాచ్.. దుమ్మురేపిన చిన్నోడు.. వీడియో వైరల్..

భారతదేశం దేనిలోనైనా రెండవ స్థానంలో ఉండవచ్చు కానీ జుగాద్ విషయానికి వస్తే, భారతదేశ ప్రజలతో ఎవరూ పోటీ పడలేరు

Viral Video: సోషల్ మీడియాలో అదరగొడుతున్న బ్యాండ్ బ్యాచ్.. దుమ్మురేపిన చిన్నోడు.. వీడియో వైరల్..
Viral Video
Follow us

|

Updated on: Aug 17, 2021 | 2:29 PM

భారతదేశం దేనిలోనైనా రెండవ స్థానంలో ఉండవచ్చు కానీ జుగాద్ విషయానికి వస్తే, భారతదేశ ప్రజలతో ఎవరూ పోటీ పడలేరు. దీనికి చాలా ఖచ్చితమైన రుజువుని ఇచ్చే వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ ఇంటర్నెట్ వలన ప్రపంచానికి పరిచయమవుతుంది. తాజాగా కొందరు పిల్లలు జుగాద్‏తో మ్యూజిక్ బ్యాండ్ తయారు చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

చాలా మంది వ్యక్తులు వ్యర్థాలను కూడా జుగాడ్ నుండి పని వస్తువుగా చేస్తారు. ఇటీవలి కాలంలో ఇదే విధమైన వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇందులో చిన్నారుల బృందం స్క్రాప్ ఐటెమ్‌లతో మ్యూజిక్ బ్యాండ్‌ను తయారు చేశారు. వీడియోలో కొంతమంది పిల్లలు గుండ్రంగా నిల్చోని వారిలో ఒకరు ప్రజల మధ్యలో నిలబడి ఉన్నారు. వారందరిలో జుగాడ్‌తో తయారు చేసిన సంగీత వాయిద్యాలు ఉన్నాయి. వారందరూ ‘ఆవో పిల్లలు మీకు చూపిస్తారు’ అనే ట్యూన్ వాయిస్తున్నారు. వీటన్నింటి మధ్యలో ఒక పిల్లవాడు నిలబడి వారిని నడిపించడం కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో పిల్లల అంకితభావం కృషి ప్రజలకు బాగా ఆకట్టుకుంటుంది. చాలామంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పిల్లవాడు ఒకరోజు కమాండ్‌కు నాయకత్వం వహిస్తాడని ఒక వినియోగదారు కామెంట్ చేయగా.. బ్యాండ్,బ్యాండ్‌మాస్టర్ ఇద్దరూ బాగున్నారని మరొక నెటిజన్ కామెంట్ చేసారు. ఈ వీడియోని ట్విట్టర్‌లో ఏవియేటర్ అనిల్ చోప్రా అనే వినియోగదారు షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఏడు వేలకు పైగా వీక్షించారు.

ట్వీట్..

Also Read: Roti v/s Brown Bread: రోటీ v/s బ్రౌన్ బ్రెడ్.. ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా..

Viral Video: రోడ్డుపై కొండముచ్చు హాల్‌చల్.. అధికారులకు ముప్పుతిప్పలు.. చివరికి..!

తెలంగాణ పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఇంతకీ అసలు టార్గెట్ ఎవరు?