కుక్కర్‏లో తలపెట్టిన చిన్నారి.. పాపం.. బుడ్డోడి అవస్థలు మాములుగా లేవు… చివరికి..

చిన్నపిల్లలు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. వాళ్లు ముద్దు ముద్దు మాటలు, చేష్టలకు అందరూ ఫిదా అయిపోతుంటారు.

కుక్కర్‏లో తలపెట్టిన చిన్నారి.. పాపం.. బుడ్డోడి అవస్థలు మాములుగా లేవు... చివరికి..
Viral
Follow us

|

Updated on: Sep 01, 2021 | 9:04 AM

చిన్నపిల్లలు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. వాళ్లు ముద్దు ముద్దు మాటలు, చేష్టలకు అందరూ ఫిదా అయిపోతుంటారు. వారికి ఎలాంటి వస్తువు కనిపించినా ఆటవస్తువుగానే చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారు చేసే అల్లరి చేష్టలు వారి ప్రాణాల మీదికే తెస్తుంటాయి. ఆటాడుతునే.. అనుకోని సమస్యలలో చిక్కుుకుంటారు. గతంలో కొందరు పిల్లలు బిందెలలో తల ఇరుక్కున్న ఘటునలు చూసి ఉంటాము. తాజాగా మరో పిల్లాడు ఆడుకుంటూ వెళ్లి ప్రెషర్ కుక్కర్‏లో తల పెట్టాడు. ఇంకేముందు.. తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి గిలగలి కొట్టుకున్నాడు. తల కుక్కర్లో ఇరుక్కుపోవడంతో పడరాని పాట్లు పడ్డాడు. చిన్నారి ఆర్తనాదాలు విని పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లిదండ్రులు.. తమ బాబును చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆ చిన్నారి తలను కుక్కర్లో నుంచి బయటకు అనేక ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కరు ఒక్కో పద్దతి ఉపయోగించి తల బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయినా ఆ బాబు తల బయటకు రాలేదు. దీంతో వెంటనే సమీపంలోని డాక్టర్ దగ్గరకు బాబుతో సహా వెళ్లారు. తమ చిన్నారి తలను కుక్కర్ లో నుంచి తీయాలని ప్రాదేయపడ్డారు. ఇక ఆ తర్వాత అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ.. ఆ బాబు తలను డాక్టర్లు బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‏లో ఆగ్రాలో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ రైస్‌ కుక్కర్‌లో తల ఇరుక్కుని నానా అవస్థలు పడ్డాడు ఓ 18నెలల పిల్లాడు. రెండు రోజుల పాటు బాలుడి తల కుక్కర్‌లోనే ఉండిపోవడంతో.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు తల్లితండ్రులు. ఓ బాలుడు ఆడుకుంటూ.. తలను ఓ రైస్‌ కుక్కర్‌లో పెట్టాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన తల్లిదండ్రులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. తలను బయటకు తీసేందుకు శతవిధాల ప్రయత్నించారు వైద్యులు. అయినా సాధ్యపడలేదు. ఇక చేసేది ఏమిలేక, రెండు గంటల పాటు శ్రమించి, కట్టర్‌ మిషిన్‌తో కుక్కర్‌ మిషిన్‌ కట్‌ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: Class room ceiling: క్లాస్ రూంలో పెచ్చులూడిన స్లాబ్.. విద్యార్థులకు తీవ్ర గాయాలు, కర్నూలు జిల్లాలో ఘోరం

Viral News: తెలంగాణలో వింత ఘటన.. నిజామాబాద్ జిల్లాలో రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల.. క్యూ కట్టిన జనాలు..