Viral Video: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.!

Car Accident Video: మనకు బ్రతికే అదృష్టం ఉంటే.. ఎంతటి ప్రమాదం వచ్చినా ఏమి కాదు. చిన్న గాయం కూడా కాకుండా బ్రతికి బయటపడతాం...

Viral Video: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.!
Fire Accident

మనకు బ్రతికే అదృష్టం ఉంటే.. ఎంతటి ప్రమాదం వచ్చినా ఏమి కాదు. చిన్న గాయం కూడా కాకుండా బ్రతికి బయటపడతాం. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. ఏదో యముడు సెలవుకు వెళ్లినట్లుగా కొంతమంది ఆ ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటారు.

క్షణాల్లో మృత్యువు వరకు వెళ్లి వెనక్కి వచ్చేస్తారు. అచ్చం అలాంటి ప్రమాదమే ఒకటి తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు చూసినవారు షాక్‌కు గురవుతున్నారు. అందులో ప్రయాణిస్తున్న వారు.. మాత్రం ఈ ప్రయాణం గుర్తొచ్చినప్పుడల్లా వణికిపోతారు.

మధ్యాహ్నం వేళ కాలిఫోర్నియాలోని లేక్‌సైడ్ ఫైర్ డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓ జాతీయ రహదారిపై వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అసలు మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటో తెలియవు గానీ.. ప్రమాద సమయంలో కారులో వృద్ద దంపతులు ఉన్నారు. చుట్టూ నిర్మానుష్య ప్రదేశం.. సాయానికి వారు ఎంత అరిచినా ఎవ్వరికీ వినబడదు.

అయితే అనూహ్యంగా ఎగిసిపడుతున్న మంటల నుంచి ఆ వృద్ద దంపతులను రక్షించేందుకు అటుగా వెళ్తున్నవారందరూ ముందుకు వచ్చారు. హుటాహుటిన కారు డోర్‌ను తీసి అందులో ఉన్నవారిని బయటికి తీశారు. ఇక అక్కడే ఉన్నవారు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. కాగా, ఆ వృద్ద దంపతులు చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ”కొంచెం ఆలస్యమైనా వారి ప్రాణం పోయేది. రియల్ హీరోస్” అంటూ సాయం చేసినవారిని నెటిజన్లు మెచ్చుకున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu