Puzzle: ఈ బస్సు ఎటువైపు పోతుంది.. జర చెప్పరాదు.. దిమాక్ కరాబ్ అవుద్ది చిచ్చా..

ఈ పజిల్‌లో, బస్సు ఏ దిశలో వెళుతుందో గుర్తించడానికి ప్రయత్నించండి. మీరు ఈ చిక్కు ప్రశ్నకు 20 సెకన్లలో ఆన్సర్ కనిపెడితే మీరు క్రియేటివ్ పర్సన్స్ అంతే.

Puzzle: ఈ బస్సు ఎటువైపు పోతుంది.. జర చెప్పరాదు.. దిమాక్ కరాబ్ అవుద్ది చిచ్చా..
Brain Teaser
Follow us

|

Updated on: Jul 06, 2022 | 11:22 AM

Brain Teaser: పజిల్స్ ఈ మధ్య నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ పజిల్స్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూజన్(optical illusion) పజిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు కనిపించడమే వీటి స్టైల్. వీటిని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆన్సర్ చూశాక.. అరెరె ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాం అనిపిస్తుంది. ఇలాంటి వాటిని సాల్వ్ చేయడానికి మీరు సృజనాత్మకను ఉపయోగించాలి. ఇచ్చిన పజిల్‌ను కొద్దిగా భిన్నంగా, ఔట్ ఆఫ్ బాక్స్ వచ్చి విశ్లేషించాలి. ఎంత సేపు చెక్ చేసినా.. మన కళ్లను ఈ పజిల్స్ మోసం చేస్తూనే ఉంటాయి. మీరు కాస్త ఇస్మార్ట్‌గా ఆలోచిస్తే మాత్రం  వీటిని తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చు. తాజాగా ఓ బ్రెయిన్ టీజర్ నెట్టింట వైరల్ అవుతుంది. పై చిత్రంలో, బస్సు ఏ దిశలో వెళుతుందో మీరు గుర్తించాలి. సమాధానం మీరు అనుకున్నంత సులువు కాదు కాబట్టి.. కాస్త ఆచి తూచి అంచనా వెయ్యండి. ఏంటి ఏం అర్థం కావట్లేదా..?. అలాగని కిందకు వెళ్లి వెంటనే ఆన్సర్ చూడకండి. అస్సలు కిక్ ఉండదు.  మీ కోసం ఓ క్లూ ఇస్తాం. ఆ బస్సును డ్రైవర్ ఇండియన్ రోడ్స్‌లో నడుపుతున్నాడు. ఇది చెబితే చాలామందికి బల్బ్ వెలిగి ఉంటుంది. ఇక లేదంటే మాత్రం మేమే ఆన్సర్ చెప్పేస్తాం.

ఈ బ్రెయిన్ పజిల్‌లో, బస్సు కుడి వైపుకా లేదా ఎడమ వైపుకా.. ఎటువైపు కదులుతుందో మీరు చెప్పాలి.  మీకు ఈ ఫోటోలో బస్ డోర్ కనిపించలేదు. అంటే బస్సు ఎడమవైపు కాకుండా “కుడి ” దిశలో వెళుతుందని అర్థం. ఎందుకంటే మన దగ్గర బస్సులకు డోర్స్ ఎడమ వైపు ఉంటాయి. వాహనాలు ఎడమవైపు డ్రైవ్ చేసే ఇండియా, యూకే వంటి దేశాల్లో ఇలా ఉంటుంది. కానీ రోడ్డుకు కుడి వైపున డ్రైవ్ చేసే  US వంటి దేశాల్లో ఈ లాజిక్ రివర్స్ అవుతుంది. లాటరల్ థింకింగ్‌ చేయడం వల్ల ఇలాంటి గమ్మత్తైన పజిల్స్‌కు వెంటనే సమాధానాలు కనిపెట్టవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్