ఈ కారోడికి ఎంత పెద్ద శిక్షవేసినా తక్కువే.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. రెండు ప్రాణాలు..

ఐపీఎస్ అధికారి, బెంగళూరు తూర్పు డీసీపీ కళా కృష్ణస్వామి ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. దయచేసి మీరు మీ వాహనం తలుపులు తెరిచేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి..

ఈ కారోడికి ఎంత పెద్ద శిక్షవేసినా తక్కువే.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. రెండు ప్రాణాలు..
Accident Video
Follow us

|

Updated on: Oct 06, 2022 | 9:26 PM

దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరి బాధ్యతారాహిత్యం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. అందుకే.. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. కొందు వాహనం నడుపుతున్నప్పుడు అజాగ్రత్తగా ప్రవర్తించడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. ఒకరి బాధ్యతారాహిత్యం కారణంగా ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఐపీఎస్ అధికారి, బెంగళూరు తూర్పు డీసీపీ కళా కృష్ణస్వామి ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. దయచేసి మీరు మీ వాహనం తలుపులు తెరిచేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి.. అంటూ ఆయన వీడియోను షేర్ చేశారు. ఇలాంటి అజాగ్రత్త చర్యలను నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు అధికారి ఈ వీడియోను షేర్ చేశారు.

9 సెకన్ల నిడివి గల వీడియోలో ఒక కారు డ్రైవర్ కారణంగా బైకర్‌ ప్రమాదంలో పడిన దృశ్యం కనిపిస్తుంది. రోడ్డుపై కారు నిలిపి ఉంటుంది. ఈ సమయంలో బైక్ వెనుకనుంచి వస్తుంది. దానిపై ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నారు. కారు దగ్గరకు బైక్ రాగానే.. కారులో ఉన్న వ్యక్తి డోర్‌ను తెరుస్తాడు. దీంతో బైక్ కు ఆ డోర్ తాకి.. నేరుగా ఎదురుగా వస్తున్న ట్రక్ కింద పడుతుంది. ద్విచక్ర వాహనం సరైన దిశలోనే వస్తుండగా.. కారు డ్రైవర్ బాధ్యతారాహిత్యంతో ఈ ప్రమాదం జరగుతుంది.

వీడియో చూడండి..

కారు డోర్‌ వల్ల బైకర్ బైక్‌పై నియంత్రణ కోల్పోయి, ట్రక్కును ఢీకొట్టి దాని టైర్ కింద పడిపోయాడు.. ఈ ప్రమాదం తర్వాత చుట్టుపక్కల నిలబడి ఉన్న వ్యక్తులు వారికి సహాయం చేయడానికి పరుగెత్తటం కూడా వీడియోలో కనిపిస్తుంది. అయితే.. ఐపీఎస్ అధికారి ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందనేది చెప్పలేదు. వీడియో చూస్తుంటే.. ఇది 2017 ఏప్రిల్ 19న ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లో దీనిని షేర్ చేసిన అనంతరం వేలాది మంది వీక్షించి.. పలు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..