వజ్రాలు దొంగతనం చేశాయని ఎలుకల మీద కేసు నమోదు

మన ఇంట్లో దొంగలు పడి చిన్న వస్తువు తీసుకెళ్లినా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి అలాంటిది జ్యువెలరీ షాపులో దొంగలుపడి వజ్రాలనే ఎత్తుకెల్లితే ఆ షాపు యజమాని ఊరికే ఉంటాడా? వెళ్లి దొంగల మీద కంప్లైంట్ చేశాడు. అయితే ఇక్కడ దొంగలు మాత్రం మనుషులు కాదు.. ఎలుకలు. మొదట అవాక్కయిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు. బీహార్‌లోని పట్నాలో ఒక జ్యువెలరీ షాపులో ఫాల్స్ సీలింగ్ నుంచి కిందికి […]

వజ్రాలు దొంగతనం చేశాయని ఎలుకల మీద కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 9:06 PM

మన ఇంట్లో దొంగలు పడి చిన్న వస్తువు తీసుకెళ్లినా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి అలాంటిది జ్యువెలరీ షాపులో దొంగలుపడి వజ్రాలనే ఎత్తుకెల్లితే ఆ షాపు యజమాని ఊరికే ఉంటాడా? వెళ్లి దొంగల మీద కంప్లైంట్ చేశాడు. అయితే ఇక్కడ దొంగలు మాత్రం మనుషులు కాదు.. ఎలుకలు. మొదట అవాక్కయిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు. బీహార్‌లోని పట్నాలో ఒక జ్యువెలరీ షాపులో ఫాల్స్ సీలింగ్ నుంచి కిందికి దిగిన ఎలుకలు నేరుగా వజ్రాలను స్టోర్ చేసే ప్రాంతానికి వెళ్లి ఓ వజ్రాల ప్యాకెట్‌ను నోటికి కరుచుకుని తిరిగి సీలింగ్‌లోకి వెళ్లిపోయాయి. వజ్రాలను షాపులో వ్యక్తులే తీశారన్న అనుమానంతో సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించిన యజమాని ఎలుకల నిర్వాకంచూసి దుకాణం ఫాల్స్ సీలింగ్ తొలగించి వజ్రాల కోసం వెతికితే అక్కడ ఎలుకలు లేవూ.. వజ్రాలూ లేవు. వజ్రాల విలువ లక్షలలో ఉండడంతో యజమాని పోలీసులకు పిర్యాదు చేశారు. చుట్టుపక్కల ఇళ్లలోకి ఒకవేళ పట్టుకెళ్తే వెతికిపెట్టమని పోలీసులకు వేడుకున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు తమ ఇంట్లో ఎలుకలు వజ్రాలు తెచ్చాయేమో అని ఇల్లంతా జల్లెడపట్టేస్తున్నారట!