
సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. జపాన్‌లోని ఉత్సునోమియా నగరంలో ఒక అడవి నల్ల ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించి, మూడు రోజుల పాటు వీధుల్లో తిరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ఒక పార్కు సమీపంలో సుమారు ఒక మీటరు పొడవు, 100 కేజీల బరువున్న ఆసియా నల్ల ఎలుగుబంటి మొదట కనిపించింది. ఆ తర్వాత అది నగరంలోని షాపింగ్ ఆర్కేడ్లు, నివాస ప్రాంతాలు, చివరకు అర్ధరాత్రి వేళ సీసీటీవీ కెమెరాల్లో ఒక వీధి గుండా పరిగెడుతూ కనిపించింది. నగర చరిత్రలోనే ఇలా ఎలుగుబంటి రావడం ఇదే మొదటిసారి. దీంతో విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని, అధికారులు నగర పరిధిలోని అన్ని 94 ప్రభుత్వ ప్రాథమిక, జూనియర్ హైస్కూళ్లను రెండు రోజుల పాటు పూర్తిగా మూసివేశారు.
ఎలుగుబంటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, స్థానిక హంటర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగారు. నగర వీధుల్లో లౌడ్‌స్పీకర్లు ఉన్న వాహనాల ద్వారా.. ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, తలుపులు, కిటికీలు లాక్ చేసుకోవాలని అధికారులు నిరంతరం హెచ్చరికలు జారీ చేశారు.
గడిచిన కొద్ది సంవత్సరాలుగా జపాన్‌లో ఎలుగుబంట్ల సంచారం, మనుషులపై దాడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ ఎలుగుబంట్ల సంచార కేసులు నమోదయ్యాయి. అలాగే గత ఏడాది ఎలుగుబంట్ల దాడి వల్ల రికార్డు స్థాయిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్యే ఫుకుషిమా నగరంలో ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలోకి దూరిన ఒక తెలివైన ఎలుగుబంటి నలుగురిని గాయపరిచి, తానే స్వయంగా లాక్ చేసిన కిటికీ తెరిచి పారిపోవడం సంచలనం సృష్టించింది.
🚧มีภาพจากล้องวงจรเกี่ยวกับหมีที่ญี่ปุ่นอีกแล้ว🐻
ช่วงประมาณตี 2 ของวันที่ 7 มิ.ย.
ได้มีผมีวิ่งออกมาที่ Orion-dori ที่เมือง Utsunomiya แล้วตรงนี้อยู่ในใจกลางเมืองและศูนย์การค้ามากๆแล้วยังดีที่หมีไม่เข้าไปสนใจคนที่กำลังเดินมา😮💨 pic.twitter.com/nEgP3WP535
— あっくん🏂 (@attopsa4) June 7, 2026
వాతావరణ మార్పుల వల్ల అడవుల్లో ఎలుగుబంట్లు తినే ఓక్ పండ్లు, గింజల కొరత ఏర్పడటం ఒక కారణమైతే, జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గిపోయి పొలాలు బీడుగా మారడంతో.. అడవి జంతువులు సులభంగా నగరాల వైపు వస్తున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఎలుగుబంట్లను నిరోధించడానికి జపాన్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అది మీరు చూడవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్, వీడియోల కోసం క్లిక్ చేయండి..