అది ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే మార్కెట్. అలాంటి మార్కెట్లోని ఓ చెత్తకుప్ప దగ్గర అనుమానాస్పద బ్యాగ్ ఒకరికి దొరికింది. దాన్ని విప్పి చూసి అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ అసలు అందులో ఏముందంటే..
వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్‌బెంగాల్‌లోని సిలిగుడి ప్రాంతం నక్సల్బరీ మార్కెట్లోని ఓ బంగారు దుకాణం వెనుక స్థానిక నివాసికి అనుమానాస్పద బ్యాగ్ ఒకటి దొరికింది. దాన్ని విప్పి చూడగా అతడు షాక్‌కు గురయ్యాడు. అందులో కుప్పలుగా ఆస్థిపంజరాలు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. స్పాట్‌కు చేరుకున్న ఖాకీలు.. ఆస్థిపంజరాలతో ఉన్న ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ బ్యాగ్‌లో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతులకు సంబంధించిన ఎముకలు ఉన్నాయి. వాటిపై ఇంగ్లీష్ అక్షరాల్లో పేర్లు రాసి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..