Viral Video: ఈ అమ్మాయి ట్రిప్లింగ్‌ ట్యాలెంట్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే…

సోషల్ మీడియాలో మనం ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని ఫన్నీ గానూ, మరికొన్ని నవ్వు తెప్పించే....

Viral  Video: ఈ అమ్మాయి ట్రిప్లింగ్‌ ట్యాలెంట్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే...
Follow us

|

Updated on: Oct 25, 2021 | 9:22 AM

సోషల్ మీడియాలో మనం ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని ఫన్నీ గానూ, మరికొన్ని నవ్వు తెప్పించే విధంగానూ ఉంటాయి. ఇంకొన్ని చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యపరిచే విధంగానూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను షాకింగ్‌కు గురిచేస్తోంది. వివరాల్లోకి వస్తే…అంతర్జాతీయ త్రీడీ పెయింటింగ్‌ కళాకారిణీగా గుర్తింపు పొందిన శిఖాశర్మ… ఈ కళలో ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా సొంతం చేసుకుంది. తన ‘ట్రిప్పింగ్‌’ వీడియోలకు సోషల్‌ మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నెటిజన్లు ఆమె వీడియోలను మెచ్చుకుంటూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ వీడియోనే ఇన్‌స్టాలో పంచుకుంది శిఖా.

చిత్రం..విచిత్రం.. ‘ఈ వీడియోలో భాగంగా మొదట మనకి ఓ అందమైన అమ్మాయి నేలపై కూర్చొని న్యూస్‌ పేపర్‌ చదువుతున్నట్లు అనిపిస్తుంది. అయితే అంతలోనే ఆ అమ్మాయి మీద మరో అమ్మాయి కర్చీఫ్‌ వేస్తుంది. దీంతో కూర్చొని పేపర్‌ చదువుతున్న అమ్మాయి కాస్తా పెయింటింగ్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి చిత్రాన్ని చెరిపేసి దానిపైన చిరునవ్వులు చిందిస్తూ కూర్చొంటుంది. మళ్లీ కాసేపటికే అదంతా పెయింటింగ్‌గా మారిపోయి దాన్ని చిత్రిస్తున్న అదే అమ్మాయి ఆర్టిస్టుగా వీడియో చివర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…శిఖా శర్మే తనను అన్ని రకాలుగా చిత్రీకరించి అద్భుతంగా వీడియోను రూపొందించడం విశేషం. ఇది చదవడానికంటే చూడడానికి చాలా సరదాగా ఉంటోంది. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ ‘ట్రిప్పింగ్’ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by YouTube (@youtube)

Also Read:

Earthquake Live Video: భూకంపం లైవ్‌ వీడియో.. వైరల్ అవుతున్న షాకింగ్‌ విజువల్స్‌..!

Space Robotics: నాసా స్పేస్ రోబోటిక్స్‌లో శ్రీకాకుళం యువకుడి టాలెంట్..! అంతర్జాతీయ గుర్తింపు.. (వీడియో)

Viral Video: అంకుల్‌.. ఆంటీని ఒక్కసారి హగ్‌ చేసుకోవచ్చా..? పర్మిషన్‌ అడిగిన చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..(వీడియో)