Anand mahindra: ఆనంద్‌ మహీంద్రాను ఆశ్చర్యానికి గురి చేసిన ఫోటో.. ఇంతకీ అంతలా ఏముందనేగా..?

Anand mahindra: ఆనందర్ మహీంద్రా.. సోషల్‌ మీడియా (Social Media) గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Anand mahindra: ఆనంద్‌ మహీంద్రాను ఆశ్చర్యానికి గురి చేసిన ఫోటో.. ఇంతకీ అంతలా ఏముందనేగా..?
Anand Mahindra
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 02, 2022 | 7:17 AM

Anand mahindra: ఆనందర్ మహీంద్రా.. సోషల్‌ మీడియా (Social Media) గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పారిశ్రామిక వేత్తగా నిత్యం బిజీగా ఉండే ఆనంద్‌.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన, స్ఫూర్తి దాయకమైన విషయాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆనంద్‌ మహీంద్ర పోస్ట్ చేసిన ఆ ఫొటో ఏంటంటే..

సాధారణంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయితే ఏం చేస్తాం. నిజానికి అయితే ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. కానీ మనలో చాలా మంది ఎక్కడ సందు దొరుకుతుందా ఎలా ముందుకు వెళ్దామా అని చూస్తుంటారు. అవసరమైతే ఫుట్‌పాత్‌పైకి వాహనాలు ఎక్కిస్తారు, లేదా అవకాశం దొరికితే రాంగ్‌రూట్‌లో అయినా ముందుకు వెళుతుంటారు. అయితే మిజారం పట్టణంలో మాత్రం అక్కడి పౌరులు చూపిన విజ్ఙత ఎంతో మందికి కనువిప్పు కలిగించేలా చేసింది. మిజోరం పట్టణంలోని ఓ రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అంతలా ట్రాఫిక్‌ జామ్‌ ఉన్నా ఒక్క వాహనం కూడా రోడ్డు మధ్యలో ఉండే తెల్లని గీతను దాటలేదు. అవతలి పక్కన రోడ్డు ఖాళీగా ఉన్నా వెళ్లాలనే ఆలోచన చేయలేదు.

ఈ ఫోటోను ట్విట్టర్‌లో ఎవరో పోస్ట్‌ చేయగా ఈ పోస్ట్‌ కాస్త ఆనంద్‌ మహీంద్ర దృష్టిలో పడింది. దీంతో వెంటనే రీట్వీట్ చేసిన ఆనంద్‌.. ‘అద్భుతమైన ఫోటో, ఒక్క వాహనం కూడా రోడ్డు మధ్యలో ఉన్న గీతను దాటలేదు. వీరు చేసిన పని గట్టి మెసేజ్‌తో పాటు, స్ఫూర్తినిస్తుంది. కొన్ని నియమాలు పాటించడం ద్వారా మన జీవన ప్రమాణల నాణ్యతను పెంచుకోవడం మన బాధ్యత. మిజోరం ప్రజలకు చప్పట్లు’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆనందర్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మిజోరం ప్రజల డెడికేషన్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు