Ambassador Car: 1964లో అంబాసిడర్ కారు ధర ఎంతో తెలిస్తే నివ్వెరపోతారు

భారతీయ మార్కెట్లో తిరుగులేని సత్తాను చాటాయి అంబాసిడర్ కార్లు. ఒకప్పుడు ఈ కార్లు స్టేటస్‌కి సింబల్. అప్పట్లో ఏపీలోని రాయల సీమలో ఈ కార్లను ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. . అయితే ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ధర ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Ambassador Car: 1964లో అంబాసిడర్ కారు ధర ఎంతో తెలిస్తే నివ్వెరపోతారు
Ambassador Car
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2024 | 8:57 AM

జనరేషన్స్ మారినా.. వింటేజ్ అంబాసిడర్ రాయల్టీ నెక్ట్స్ లెవల్ అంతే.  బ్రిటీష్ మూలాలు ఉన్నప్పటికీ, భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందింది ఈ కారు. ఈ కార్లు ఇప్పుడు విక్రయానికి లేవు కానీ.. అడపా దడపా రీ మోడలింగ్ చేసినవి రోడ్లపై అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.  గతంలో అంబాసిడర్ కారు రోడ్డుపైకి వస్తే.. ఆ దర్జానే వేరు.  అంబాసిడర్ కారును  ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’ గా పిలిచేవారు.  భారత ఆర్మీ అధికారుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, సినిమా స్టార్స్.. ఇలా వివిధ స్థాయిల్లో ఉన్నవారు ఈ అంబాసిడర్ కారునే వినియోగించేవారు. 90వ దశాబ్ధంలో ఈ కారు ఉంటే.. వారు శ్రీమంతులు అన్నట్లే లెక్క. అంబాసీడర్‌‌ కారును స్టేటస్‌కి ఓ సింబల్‌గా పరిగణించేవారు. ప్రస్తుతం జనరేషన్‌కి తగ్గుట్టు ఈ కారు అప్ డేట్ అవ్వకపోవడంతో అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి.

తాజాగా త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో వివిధ రకాలు పాత అంశాలు, పాత వస్తువులు, అలనాటి విశేషాలకు సంబంధించిన అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో 1964 నాటి అంబాసిడర్ కారు ఇన్ వాయిస్ వైరల్‌గా మారింది. అప్పట్లో అంబాసిడర్ కారు ధర చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు. 1964లో అంబాసిడర్ కారు బిల్లును మద్రాస్ ట్రెండ్స్ అనే ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కారును అక్టోబర్ 20, 1964న కొనుగోలు చేసినట్లు అందులో రాసి ఉంది. 1964లో అంబాసిడర్ ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం.

వైరల్ బిల్లు ప్రకారం, కారు ధర రూ.13,787. దీనితో పాటు అమ్మకం పన్ను రూ.1493. రవాణా రుసుము రూ. 897. ఇక కారు నంబర్ ప్లేట్‌కు రూ.7 వంటి ఛార్జీలను కలిపి మొత్తం రూ.16,495కి అమ్మినట్లుగా ఆ బిల్లులో ఉంది. 1964లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్‌ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా తెలుస్తోంది.  కాగా ఇప్పటికీ కొంతమంది వింటేజ్ కార్లను లైక్ చేసేవారు.. పాత అంబాసీడర్‌‌ కార్లను రీ మోడలింగ్ చేయించి మరీ వినియోగిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..