Funny Video: వయస్సు మర్చిపోయిన పెద్దాయన.. అమ్మాయితో కలిసి ప్రభుదేవాలా డ్యాన్స్ ఇరగదీశాడుగా..

సల్సా నృత్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఓ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. అందులో ఓ యువతి నృత్యం చేస్తుండగా.. ఆమెతో కలిసి సమానంగా స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు ఓ వయో వృద్ధుడు. ఈ వీడియోను ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్..

Funny Video: వయస్సు మర్చిపోయిన పెద్దాయన.. అమ్మాయితో కలిసి ప్రభుదేవాలా డ్యాన్స్ ఇరగదీశాడుగా..
Old Man Slasa Dance
Follow us

|

Updated on: Oct 06, 2022 | 5:23 PM

కొన్ని పనులు చేయడానికి వయసుతో పని లేదంటారు. ఇది నిజమే అని కూడా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూసినప్పుడు, వయసు అంకెలకు మాత్రమే పరిమితం.. ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే కొన్నిసార్లు వయస్సు అడ్డరాదు. అయితే ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. సరదాగా ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడో లేదా సరదాగా ఫ్రెండ్స్ తో ఫిక్నిక్ కు వెళ్లినప్పుడో చాలా మంది వయసును మర్చిపోతుంటారు. కొందరైతే చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ చిలిపి చేష్టలతో అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఇంకొందరైతే ఆట, పాటలతో ఉర్రుతలూగిస్తారు. అదీ కూడా ఒక వయసు వరకు మాత్రమే.. ఐదు పదులు లేదా ఆరు పదుల వయసు సమీపిస్తే ఇక కొన్ని సరదాలను వదులకోవల్సి వస్తుంది. సరదాగా ఆటపాలటతో గడుపుదామన్నా వయసు సహకరించదు. కాని ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం మతిపోక తప్పదు. అదేంటీ అందులో అంత స్పెషల్ ఏముందనుకుంటున్నారా.. నిజమేనండి ఆ వీడియో స్సెషలే మరీ.. ఎందుకంటే ఓ పెద్దాయన.. అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపర్చాడు. అది కూడా ఏదో సాదా సీదా డ్యాన్స్ కాదండోయ్. ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ లా ఇంకా చెప్పాలంటే ప్రభుదేవాను గుర్తుచేసేలా అనుకోండి.. అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్లందరితో ఔరా అనిపించుకుంటున్నాడు.

సల్సా నృత్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఓ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. అందులో ఓ యువతి నృత్యం చేస్తుండగా.. ఆమెతో కలిసి సమానంగా స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు ఆ వయో వృద్ధుడు. ఈ వీడియోను ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. ఓ యువతిని పట్టుకుని ఆమె వేసిన స్టెప్పులకు స్టెప్పులు వేస్తూ ఆమెతో సమానంగా డ్యాన్స్ చేశాడు ఆ వృద్ధుడు. వయస్సు మర్చిపోయి తాను ఓ కుర్రాడినే అన్నట్లు యువతితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. కేవలం అతనొక్కడే ఎంజాయ్ చేయలేదండోయ్.. అతని డ్యాన్స్ తో కార్యక్రమంలో ఉన్న వారందరినీ ఉత్సహపర్చాడు. అక్కడితో ఆగలేదు. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లందరినీ ఉత్సహపరుస్తున్నాడు ఈ వయో వృద్ధుడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను పోస్టు చేయగానే లక్షలాది మంది వీక్షించడంతో పాటు లక్షల లైక్ లను పొందింది. అలాగే నెటిజన్లు అంతా ఆ వృద్ధుడిని ప్రసంశిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. వయసు ఒక సంఖ్య మాత్రమే దానికి నిదర్శనమే ఈ వీడియో అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరికొంత మంది అయితే ఆయన వయస్సు కేవలం 18 సంవత్సరాలే అంటూ చమత్కరిస్తూ కామెంట్స్ పెట్టారు. ఇలా అతి తక్కువ సమయంలో ఈ వృద్ధుడి సల్సా డ్యాన్స్ వైరల్ అయింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..