Video Viral: అరెరె.. మెహందీతో చేతిపై మ్యాథ్స్ ఫార్ములాలు.. ఎగ్జామ్ లో ఇలా కూడా కాపీ కొట్టొచ్చా అని కామెంట్లు..

ఇంటర్నెట్ అనేది రకరకాల వీడియోలు, ఫొటోలకు మంచి ప్లాట్ ఫామ్. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత చాలాసార్లు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు...

Video Viral: అరెరె.. మెహందీతో చేతిపై మ్యాథ్స్ ఫార్ములాలు.. ఎగ్జామ్ లో ఇలా కూడా కాపీ కొట్టొచ్చా అని కామెంట్లు..
Henna Design
Follow us

|

Updated on: Jan 06, 2023 | 7:39 AM

ఇంటర్నెట్ అనేది రకరకాల వీడియోలు, ఫొటోలకు మంచి ప్లాట్ ఫామ్. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత చాలాసార్లు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఆశ్చర్యం కలిగించే వీడియోలు ఉంటే.. మరికొన్ని సార్లు ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు ఉంటాయి. పెరుగుతున్న సాంకేతికత ప్రతిదీ సులభం చేసింది. టెక్నాలజీ సహాయంతో ఎంటర్టైన్మెంట్ నుంచి విద్యార్థుల స్టడీస్ వరకు అన్నీ.. అందుబాటులోకి వచ్చేశాయి. అయితే.. ఎగ్జామ్స్ అనగానే కొందరు గడుగ్గాయిలు కాపీయింగ్ చేస్తుంటారు. పరీక్షలో కాపీ కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలో పాస్ అయ్యేందుకు కాపీయింగ్‌ కు పాల్పడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు హైటెక్ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు, కాలేజీలు, పాఠశాలల పరీక్షల్లో కాపీ కొడుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ విద్యార్థి చేతిపై మెహందీతో మ్యాథ్స్ ఈక్వేషన్స్ రాయడాన్ని చూడవచ్చు. అచ్చం డిజైన్ ను తలపించేలా ఫార్ములాలు రాశారు. ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..