Viral Video: బురద నీటిలో స్టూల్ ప్రయాణం.. అతగాడి టెక్నిక్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు

వర్షాకాలంలో వీధుల్లో నీరు నిలిచిపోవడం వంటి సాధారణమే. వర్షం తగ్గిపోయినప్పటికీ వీధుల్లో వరద నీరు తగ్గకుండా బురదగానే దర్శనమిస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి వెళ్లే ప్రతి వ్యక్తి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తారు. కాగా...

Viral Video: బురద నీటిలో స్టూల్ ప్రయాణం.. అతగాడి టెక్నిక్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు
Muddy Water Viral Video
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 3:00 PM

వర్షాకాలంలో వీధుల్లో నీరు నిలిచిపోవడం వంటి సాధారణమే. వర్షం తగ్గిపోయినప్పటికీ వీధుల్లో వరద నీరు తగ్గకుండా బురదగానే దర్శనమిస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి వెళ్లే ప్రతి వ్యక్తి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తారు. కాగా ఇలా వాన నీటిలో తడవకుండా ఓ వ్యక్తి వెరైటీగా ట్రై చేశాడు. కట్ చేస్తే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలివిగా ఆలోచించడం ద్వారా కష్టమైన పనిని కూడా సునాయసంగా చేయవచ్చన్న విషయం మనకు తెలిసిందే. ఈ వీడియోలో ఓ వ్యక్తి.. నీళ్లతో నిండిన దారిని దాటేందుకు రెండు స్టూల్స్ సహాయం తీసుకున్నాడు. వాటికి రెండు తాళ్లను అతికించాడు. అలా ఒకదానిపై అడుగు వేశాక, మరో స్టూల్ ను ముందుకు జరిపి దానిపై కాలు పెట్టాడు. అలా ముందుకు స్టుళ్లను జరుపుతూ చివరికి గమ్యానికి చేరుకున్నాడు.

ఈ వీడియోను @gudiyarani01 అనే నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా ఈ వీడియోను చూసిన ప్రజలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మా దేశీ జుగాడ్ చాలా భిన్నమైనది, ప్రత్యేకమైనదని ఒకరు.. ఈ వీడియోను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందేనని మరొకరు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu