అడవికి రాజు సింహం. ఎంత పెద్ద జంతువైనా.. సింహం పంజా దెబ్బకు విలవిల్లాడాల్సిందే. జంతువులకే కాదు.. మనుషులకూ వాటితో ప్రమాదమే. అవి కనిపిస్తే చాలు అక్కడి నుంచి పరుగు అందుకుంటారు. నిజానికి సింహాలు అడవుల్లో నివసిస్తుంటాయి. కానీ అవి అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి. అడవుల్లో వాటికి సరిపడా ఆహారం లభించని పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆహారాన్ని వెదుక్కుంటూ.. గ్రామాలు, పట్టణాల్లోకి వస్తుంటాయి. మేకలు, ఆవుల మందపై దాడి చేస్తుంటాయి. అలాంటి వీడియోలు, సంఘటనలు మనం ఎన్నో చూశాం. గ్రామాల్లోకి వచ్చి వీధుల్లో తిరుగుతూ భయాందోళన కలిగించిన ఘటనలు ఎన్నో. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోను రాత్రి సమయంలో షూట్ చేశారు. వీడియోలో ఓ సింహం.. గ్రామంలోకి ప్రవేశించింది. వీధుల్లో చాలా దర్జాగా తిరిగేసింది. ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఓ జంతువు కనిపించింది. వెంటనే దానిపై పంజా విసిరి చంపేసి ఆకలి తీర్చుకుంది. అయితే.. సింహం వెళ్తున్న సమయంలో దాని వెనకాలే కొందరు యువకులు వీడియో తీయడం కలకలం రేపుతోంది. ఒకవేళ అది ఎదురుతిరిగి ఉంటే పరిస్థితి ఏంటని చెవులు కొరుక్కుంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.
View this post on Instagram
గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ వీడియో ప్రముఖ సోషల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయింది. ఇప్పటివరకు వీడియోకు 25 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది ప్రజలు వీడియోను లైక్ చేశారు. వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..