Video Viral: సింహం చేతికి చిక్కితే నూకలు చెల్లినట్లే.. అది వేటాడే తీరు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

భూమిపై చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి. వాటిలో ప్రమాదకరమైన జంతువులు కూడా ఉన్నాయి. క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. సింహం కంటే భయంకరమైన, ప్రమాదకరమైన..

Video Viral: సింహం చేతికి చిక్కితే నూకలు చెల్లినట్లే.. అది వేటాడే తీరు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..
Liion Hunting Video
Follow us

|

Updated on: Sep 18, 2022 | 1:23 PM

భూమిపై చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి. వాటిలో ప్రమాదకరమైన జంతువులు కూడా ఉన్నాయి. క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. సింహం కంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి లేదనే చెప్పాలి. ఇవి చాలా బలవంతమైనవే కాకుండా చాలా శక్తివంతమైనవి. తమ కంటే పెద్ద జంతవులను కూడా వేటాడి, చంపేసి ఆహారంగా మార్చుకోగలవు. ఇవి ఒక్కసారిగా దాడి చేస్తే ఎంతటి జంతవైనా మట్టికరవాల్సిందే. ఈ ప్రత్యేకతలే సింహాన్ని అడవికి రాజుగా నిలబెట్టాయి. సింహాలు వేటాడే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేటాడే సమయంలో కేవలం ఎరపై మాత్రమే దృష్టి నిలిపే ఇవి వేటాడేంత వరకు లక్ష్యాన్ని విడిచిపెట్టవు. సింహాలు వేటాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇవి ఆశ్చర్యంతో పాటు, భయాన్ని కూడా కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఈ క్లిప్ లో సింహం ఒక జంతువును వేటాడటాన్ని చూడవచ్చు. ఎర కోసం ఎప్పటినుంచో కాపు కాసిన సింహం.. ఆ జంతువు తన వద్దకు రాగానే ఒక్క ఉదుటున దానిపై దాడి చేసి పీక పట్టుకుంటుంది. అది పారిపోయేందుకు, విడిపించుకునేందుకు ప్రయత్నించినప్పిటికీ అది సాధ్యం కాలేదు. అయినా.. సింహం చేతికి చిక్కాక ఇక ప్రాణాలతో బయటపటడం జరగని పని. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 10 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 14 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..