Viral Video: రన్నింగ్‌ ట్రైన్‌లోని అనుకోని అతిథి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పాములు ప్రజల మధ్యలోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలం, వేసవి కాలంలో పాములు ఎక్కడపడితే అక్కద దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు పామును పట్టుకోవడం కంటే ముందుగా దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకేముంది దీంతో క్షణాల్లో పాములకు...

Viral Video: రన్నింగ్‌ ట్రైన్‌లోని అనుకోని అతిథి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
Viral Video
Follow us

|

Updated on: Sep 23, 2024 | 6:55 AM

జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పాములు ప్రజల మధ్యలోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలం, వేసవి కాలంలో పాములు ఎక్కడపడితే అక్కద దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు పామును పట్టుకోవడం కంటే ముందుగా దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకేముంది దీంతో క్షణాల్లో పాములకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సాధారణంగా పాములు ఇళ్లలోకి, బండ్లలోకి, కారు ఇంజన్‌లోకి చొరబడడం చూసి ఉంటాం. అయితే ఓపాము మాత్రం ఏకంగా రన్నింగ్ ట్రైన్‌లోకే వచ్చేసింది. ఎలా వచ్చిందో ఏమో కానీ ప్రయాణికులు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. జబల్‌పుర్‌-ముంబయి గరీబ్‌రత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జబల్‌ పుర్‌ నుంచి ముంబయికి గరీబ్‌రత్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలు దేరింది.

వైరల్ వీడియో..

ఈ క్రమంలోనే కాసర రైల్వే స్టేషన్‌ సమీపిస్తున్న వేళ ఏసీ కోచ్‌ జీ3లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. బెర్త్‌ హ్యాండిల్‌కు చుట్టుకొని హంగామా చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే భయపడి పక్క కోచ్‌లోకి వెళ్లిపోయారు. అయితే విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే సదర్‌ పాము ఉన్న చోటుకు వచ్చి దానిని బయటకు వదిలిపెట్టారు.

అయితే అప్పటికే ప్రయాణికులు పామును తమ కెమరాల్లో బంధించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్‌ అవుతోంది. ఎక్కడ చోటు లేనట్లు రైలులోకి కూడా పాములు వస్తున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..