Viral Video: రోడ్డుపై డజను కుక్కలతో నడుస్తున్న వ్యక్తి.. నీ భద్రత ముందు వీఐపీ కూడా తక్కువే అంటున్న నెటిజన్లు

ఈ వీడియోలో ఒక వ్యక్తి.. సంబంధించిన వీడియో (Dogs Video Viral) ఎక్కువగా వైరల్ అవుతోంది. అది చూసి జనాలు షాక్ తింటున్నారు. ఎందుకంటే.. ఈ వ్యక్తి భద్రత ముందు మంచి రాజకీయ నాయకులకు భద్రత కూడా దిగదుడుపే అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Viral Video: రోడ్డుపై డజను కుక్కలతో నడుస్తున్న వ్యక్తి.. నీ భద్రత ముందు వీఐపీ కూడా తక్కువే అంటున్న నెటిజన్లు
Dog Video Viral
Follow us

|

Updated on: Jun 27, 2022 | 8:05 AM

Viral Video: ప్రపంచంలో కుక్కలను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.  వాటిని సొంత ఇంటి పిల్లలా పెంచుకుంటూ.. వాటికీ జరిపే వేడుకల గురించి రోజుకో వార్త వింటూనే ఉన్నాం. అయితే చాలామందికి కుక్కలను పెంచుకోవడం ఇష్టమైన.. సమయం కుదరదు వాటిని సంరక్షించలేకపోతున్నామని పెంచుకోవడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే పెంపుడు జంతువుల పట్ల స్పెషల్ కేరింగ్ ఉండాలి. ఇంట్లో ఆహారం పెడితే సరిపోదు.. వాటిని ఉదయం , సాయంత్రం వాకింగ్‌కు తీసుకువెళ్లాల్సిందే.  అలా జాగింగ్ కు తమ కుక్కల్ని తీసుకుని వెళ్తూ.. యజమాని ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అనేకం ఇప్పటికే చూశాం.. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి..  సంబంధించిన వీడియో (Dogs Video Viral) ఎక్కువగా వైరల్ అవుతోంది. అది చూసి జనాలు షాక్ తింటున్నారు. ఎందుకంటే..  ఈ వ్యక్తి భద్రత ముందు మంచి రాజకీయ నాయకులకు భద్రత కూడా దిగదుడుపే అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు..  ఈ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్యక్తి డజను కుక్కలతో సంతోషంగా రోడ్డుపై నడుస్తున్నాడు. ఎవరైనా ఈ సన్నివేశాన్ని హఠాత్తుగా చూస్తే.. ఎవరో పెద్ద వీఐపీ రోడ్డుపైకి రాగా.. అతనిని శునక దళం రక్షిస్తుందేమో అనిపిస్తుంది.. ఈ క్లిప్ లో ఓ సీనియర్ అధికారి మిషన్‌లో భాగం అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్విటర్‌లో బ్యూటెంగెబిడెన్ అనే ఖాతా లో షేర్ చేశారు. కేవలం ఏడు సెకన్ల ఈ క్లిప్‌ని జనాలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. 23 లక్షలకు పైగా వ్యూస్ ను,  69 వేలకి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియోపై  ‘ఇంతకు మించి..  పెద్ద వీఐపీల భద్రత కూడా విఫలమైంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ఒకేసారి రెండు కుక్కలను సంరక్షించమే చాలా కష్టం .. అలాంటిది ఈ వ్యక్తి ఏకకాలంలో డజను కుక్కలను భలే పెంచుతున్నారు గ్రేట్ అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..