క్లాస్ రూమ్ లో ఆవు… చదువుతోందా మరి చదువు ?

ముంబై లోని ఐఐటీ లో అదో తరగతి గది .. ‘ పిల్లలంతా ‘ బుధ్దిగా చదువుకునే పనిలో పడ్డారు. లెక్చరర్ పాఠం పీక్ స్టేజిలో ఉంది. అయితే అప్పుడే ఎంటరయింది ఆ గదిలోకి ఓ మూగజీవి. తనకేమీ పట్టనట్టు.. అది తన ‘ ఇలాకా ‘ అన్నట్టు నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళింది. ఎలా.. ఎక్కడినుంచి వచ్చిందో గానీ.. బయట భోరున వర్షం కురుస్తుంటే తల దాచుకోవడానికి ఇదే.. ఈ క్లాసు రూమే బెస్ట్ అనుకున్నట్టు ఉంది. […]

క్లాస్ రూమ్ లో ఆవు... చదువుతోందా మరి చదువు ?
Pardhasaradhi Peri

|

Jul 29, 2019 | 4:33 PM

ముంబై లోని ఐఐటీ లో అదో తరగతి గది .. ‘ పిల్లలంతా ‘ బుధ్దిగా చదువుకునే పనిలో పడ్డారు. లెక్చరర్ పాఠం పీక్ స్టేజిలో ఉంది. అయితే అప్పుడే ఎంటరయింది ఆ గదిలోకి ఓ మూగజీవి. తనకేమీ పట్టనట్టు.. అది తన ‘ ఇలాకా ‘ అన్నట్టు నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళింది. ఎలా.. ఎక్కడినుంచి వచ్చిందో గానీ.. బయట భోరున వర్షం కురుస్తుంటే తల దాచుకోవడానికి ఇదే.. ఈ క్లాసు రూమే బెస్ట్ అనుకున్నట్టు ఉంది. చడీ చప్పుడు లేకుండా ప్రవేశించి..అంతా అవాక్కయి చూస్తుండగా.. ‘ వాక్ ‘ చేసింది. మరి..ఆ ఐఐటీ …. సిటీలోనే ఉందా లేక జంతువులు, ఇతర సాధు జంతువులూ తిరిగే శివారు ప్రాంతాల్లో ఉందా అన్నది తేలలేదు. ఇంతకీ… ఆ తరగతి గదిలో ఎంటరయిన ఆవు గారి వీడియో వైరల్ అవుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu