Fan Terror: సారూ కరోనా నన్నేమీ చేయదు కానీ, ఆ ఫ్యాన్ చంపేసేలా ఉంది..ఆసుపత్రి నుంచి ఓ పేషెంట్ వీడియో వైరల్

కరోనాతో అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితి మరి ఘోరంగా ఉంది ఇంటివద్ద ఐసోలేషన్ లో ఉంటె జాగ్రత్తలు తీసుకోవడానికి ఎన్నో చిక్కులు.

Fan Terror: సారూ కరోనా నన్నేమీ చేయదు కానీ, ఆ ఫ్యాన్ చంపేసేలా ఉంది..ఆసుపత్రి నుంచి ఓ పేషెంట్ వీడియో వైరల్
Fan Terror
Follow us

|

Updated on: Apr 27, 2021 | 8:07 PM

Fan Terror: కరోనాతో అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితి మరి ఘోరంగా ఉంది ఇంటివద్ద ఐసోలేషన్ లో ఉంటె జాగ్రత్తలు తీసుకోవడానికి ఎన్నో చిక్కులు.. ఇక ఆసుపత్రిలో ఉండేవారి కష్టం మరోరకంగా ఉంటుంది. ఆసుపత్రిలో.. నా అనేవారు లేకుండా.. బెడ్ మీద రెండు వారాలు ఒంటరిగా.. ఆ పక్కా ఈ పక్కా తనలాగే నిస్సహాయంగా ఉన్న ఇతర పేషెంట్స్ మధ్యలో.. మానసికంగా చిత్రవధ అనుభవిస్తారు.

కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ తనకు సహాయం చేయమని అర్ధిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అది చూసి అందరికీ నవ్వుకోవాలో.. జాలిపడాలో అర్ధంకాని పరిస్థితి వచ్చింది సోషల్ మీడియాలో. మధ్యప్రదేశ్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఆ సేల్ఫీ వీడియోలో ఒక పేషెంట్ హాస్పటల్ మంచం మీద ఉన్నాడు. చుట్టూ భయం భయంగా చూస్తూ.. సార్.. నన్ను రక్షించండి.. అంటున్నాడు.. తరువాత.. కరోనా కోసం భయం వేయడం లేదు సార్..పైన వున్న ఫ్యాన్ చూసి భయం వేస్తోంది అంటూ.. పై కప్పు కేసి చూపించాడు. అది చూసిన ఎవరికైనా షాక్ తగులుతుంది. అక్కడ సీలింగ్ లో ఓ ఫ్యాన్ తుపాను వేగంతో తిరుగుతోంది. తిరిగితే గాలి వస్తుంది కదా ఇంకేం అనుకోకండి.. ఆ ఫ్యాన్ రెక్కల కన్నా స్పీడుగా దానికి సపోర్టుగా సీలింగ్ కి పెట్టిన రాడ్డుతో సహా మొత్తం అంతే వేగంగా తిరుగుతోంది. దానిని చూస్తె ఒక సేకనులోనో.. అందులో సగం సమయంలోనో ఒక్కసారిగా కింద పడేలా ఉంది. ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు..

 

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘‘ఫ్రెండ్స్, నేను చింద్వారా జిల్లాలోని పెద్దాసుపత్రిలో అడ్మిట్ అయ్యాను. నేను చికిత్స పొందుతున్న బెడ్ మీద ఒక విదేశీ ఫ్యాన్ ఉంది. దాన్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. కరోనా గురించి నాకు భయం వేయడం లేదు. కానీ, ఈ ఫ్యాన్‌ను చూస్తుంటేనే భయం వేస్తోంది. రాత్రి పగలు ఇది చాలా భయపెడుతోంది. దయచేసిన ఆ ఫ్యాన్ మార్చండి, లేదా నాకు వేరే బెడ్ కేటాయించండని కోరుతున్నా హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఈ ఫ్యాన్ నన్ను చాలా భయపెడుతోంది’’ అని ఆ వ్యక్తి అభ్యర్దిస్తున్నాడు. అది చూసి జాలి వేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్, ట్విట్టర్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. మరి వైరల్ అయిన ఈ వీడియో ఆ ఆసుపత్రి పెద్దల వరకూ చేరుతుందో లేదో.. వేచి చూడాలి! ఆ పేషెంట్ కష్టాలు తీరాలని కోరుకుందాం.

Also Read: Corona India: సంక్షోభ‌ స‌మ‌యంలో భార‌త్‌కు అండ‌గా నిలుస్తోన్న అంత‌ర్జాతీయ క్రికెట్ ప్ర‌పంచం.. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌..

CORONA SECOND-WAVE: దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్.. మే 2న ప్రకటించనున్న ప్రధాని మోదీ!