Coffee: కాఫీకి యునెస్కో గుర్తింపు.. ఒక్కసారి రూచి చూస్తే జన్మలో మర్చిపోలేరు.. మరెన్నో విశేషాలు..

పొద్దు పొద్దునే ఓ చేతిలో న్యూస్ పేపర్.. ఇంకో చేతిలో వేడి వేడిగా పొగలు కక్కే కాఫీ.. చిటపట చినుకులు.. ఆహా.. ఊహించుకుంటనే ఎదో లోకంలో విహరిస్తున్నట్లు ఉంది కదా.. ఈ అనుభూతి గురించి తెలుసుకోవాలంటే అనుభవించాల్సిందే..

Coffee: కాఫీకి యునెస్కో గుర్తింపు.. ఒక్కసారి రూచి చూస్తే జన్మలో మర్చిపోలేరు.. మరెన్నో విశేషాలు..
Coffee
Follow us

|

Updated on: Sep 18, 2022 | 1:44 PM

పొద్దు పొద్దునే ఓ చేతిలో న్యూస్ పేపర్.. ఇంకో చేతిలో వేడి వేడిగా పొగలు కక్కే కాఫీ.. చిటపట చినుకులు.. ఆహా.. ఊహించుకుంటనే ఎదో లోకంలో విహరిస్తున్నట్లు ఉంది కదా.. ఈ అనుభూతి గురించి తెలుసుకోవాలంటే అనుభవించాల్సిందే తప్పా మాటల్లో చెప్పలేం. ఒత్తిడిగా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా, బంధువులు ఇంటికి వచ్చినా, ఫ్రెండ్స్ తో చిట్ చాట్, గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ తో కబుర్లు చెప్పుకోవాలన్నా ఓ కప్పు కాఫీ ఉండాల్సిందే. ఇంతలా మన లైఫ్ స్టైల్ లో భాగమైన కాఫీలో ఎన్నో రకాలు, మరెన్నో రుచులు.. ఇవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. టర్కీలో లభించే ఓ కాఫీ మాత్రం ఎంత రుచిగా ఉంటుందంటే అక్కడి ప్రభుత్వం దానికి వారసత్వ సంపదగా హోదా కూడా ఇచ్చేసేటంత. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజ్జంగా నిజం. పదేళ్ల క్రితం యునెస్కో కూడా దీన్ని వారసత్వ సంపదల జాబితాలోకి చేర్చింది. టర్కీలో దొరికే ప్రత్యేకమైన కాఫీ గింజలను యంత్రాలతో కాకుండా చేతుల్తోనే దంచి కాఫీ పొడి తయారు చేస్తారు. అలా దంచిన కాఫీ పొడిని ప్రత్యేకంగా రూపొందించిన కంచుపాత్రల్లో ఉంచి.. వేడివేడి ఇసుకమీద మరిగిస్తారు. అలా కాచిన కాఫీ రుచిని ఒక్కసారి రుచి చూసినా నలభై ఏళ్లు గుర్తుండిపోతుందని స్థానికులు చెప్తుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టే దీనిని అరేబియన్‌ వైన్‌ అని కూడా పిలుస్తుంటారు.

కాఫీ ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. చాలామందికి మార్నింగ్ కాఫీ తాగనిదే రోజు స్టార్ట్ అవదనడంతో అతిశయోక్తి లేదు. కాఫీ చర్మానికే కాదు జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టు సంరక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. చర్మంపై వచ్చే మొటిమలను తొలగించడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, కెఫిక్ యాసిడ్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక చెంచా కాఫీని ఒక పాత్రలో తీసుకుని, దానికి ఒక చెంచా తేనె కలిపి స్క్రబ్ చేయాలి. కావాలంటే మీరు తేనెకు బదులుగా బ్రౌన్ షుగర్ వాడవచ్చు. దీనికి నిమ్మరసం కలిపి స్క్రబ్ చేస్తే చర్మం క్లీన్ అవడమే కాకుండా లోపలి నుంచి హైడ్రేట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం