Viral Video: మేఘం పగిలిందా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోను చూస్తే మీరూ ఇదే అంటారు..

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వీటిలో ఆనందాన్ని పంచేవి కొన్నైతే ఆశ్చర్యాన్ని కలిగించేవి మరికొన్ని. ఎన్నో వింతలు, విశేషాలకు నెలవైన ఈ విశ్వంలో దాగున్న అద్భుతాలన్నంటినీ అరచేతిలో....

Viral Video: మేఘం పగిలిందా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోను చూస్తే మీరూ ఇదే అంటారు..
Follow us

|

Updated on: Jul 06, 2022 | 7:33 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వీటిలో ఆనందాన్ని పంచేవి కొన్నైతే ఆశ్చర్యాన్ని కలిగించేవి మరికొన్ని. ఎన్నో వింతలు, విశేషాలకు నెలవైన ఈ విశ్వంలో దాగున్న అద్భుతాలన్నంటినీ అరచేతిలో చూపిస్తున్న క్రెడిట్‌ సోషల్‌ మీడియాకే చెందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఇలాంటి ఓ ఆశ్చర్యకరమైన వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. అప్పటి వరకు నిర్మానుశ్యంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది. వెంటనే కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఇది మనం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం. అయితే ఒక గంట సేపు కురవాల్సిన వర్షం నీరు కొన్ని క్షణాల్లో కురిస్తే ఎలా ఉంటుంది.? ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో అలాంటిదే..

వండర్‌ ఆఫ్‌ సైన్స్‌ అనే ట్విట్టర్‌ హాండిల్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పీటర్‌ మేయర్‌ అనే ఫొటో గ్రాఫర్‌ ఈ వీడియోను చిత్రీకరించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఆస్ట్రీలియాలోని మిల్ల్‌స్టట్‌ అనే సరస్సు వద్ద రెండు పర్వతాల మధ్య నల్లటి మబ్బులతో వేగంగా కదులుతూ వచ్చింది. ఆ సమయంలో మేఘాల్లోని నీరు ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసింది. దీనంతటినీ రికార్డ్‌ చేసిన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో కాస్త తెగ సందడి చేస్తోంది. మేఘాలు ఇలా ఉన్నట్లుండి కురవడాన్ని క్లౌడ్‌ బర్ట్స్‌ పిలుస్తుంటారు.

అసలేంటీ క్లౌడ్‌ బర్ట్స్‌..

ఆకస్మాకింగా ఉన్నట్లుండి భారీ వర్షం కురియడాన్ని క్లౌడ్‌ బర్ట్స్ అంటారు. అత్యధిక తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. సాధారణంగా మేఘాలు భూ ఉపరితలం నుంచి 12-15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయి. ఈ విషయమై వెదర్‌ ఎక్స్‌పర్ట్‌ అనురంజన్‌ కుమార్‌ రాయ్‌ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక చోట ఆకస్మాత్తుగా వర్షం కురవడాన్ని క్లౌడ్‌బర్ట్స్‌గా పిలుస్తుంటారని ఆయన తెలిపారు. ‘నీటితో నిండిన బెలూన్‌ ఆకస్మాత్తుగా పేలితే నీరు ఎలా అయితే కింద పడుతుందో. మేఘాల నుంచి కూడా నీరు అలాగే భూమిని చేరుతుంది’ అని చెప్పుకొచ్చారు. అయితే ఇది కేవలం పర్వతాల దగ్గరే జరుగుతుందనే అపోహ ఉంది. మైదాన ప్రాంతాల్లోనూ క్లౌడ్‌ బర్ట్స్‌ సంభవిస్తుంటాయి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..