Wedding: కాబోయే వాడు తన తల్లి దగ్గర డబ్బు తీసుకున్నాడని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..

Wedding:  వారిద్దరికీ రెండు రోజులలో పెళ్లి కావాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు అన్నీ పూర్తయిపోయాయి. వధూవరులిద్దరికీ పెళ్లి బట్టలు కొనేశారు. చర్చిలో పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు పూర్తిచేశారు.

Wedding: కాబోయే వాడు తన తల్లి దగ్గర డబ్బు తీసుకున్నాడని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..
Wedding
Follow us

|

Updated on: May 19, 2021 | 4:11 PM

Wedding:  వారిద్దరికీ రెండు రోజులలో పెళ్లి కావాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు అన్నీ పూర్తయిపోయాయి. వధూవరులిద్దరికీ పెళ్లి బట్టలు కొనేశారు. చర్చిలో పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు పూర్తిచేశారు. బంధువర్గానికి పిలుపులు వెళ్ళిపోయాయి. ఇనేకేముంది పెళ్లి అవడమే ఆలస్యం అంతే. ఆ వధువు నాకు ఈ పెళ్లి వద్దు అవతలకి పొమ్మని వరుడిని నెట్టేసింది. ఈ పెళ్లి నేను చేసుకోనుగాక చేసుకోను అని కచ్చితంగా చెప్పేసింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇద్దరూ ప్రేమించుకున్నామని చెప్పారు. రెండు నెలలు డేటింగ్ లో ఉన్నారు.. ఔటింగ్ కు వెళ్లివచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ పెళ్లి ఎందుకు వద్దని అంటుందో అర్ధం కాక తలలు పట్టుకున్నారు. ఇక చేసేదేముందని పెళ్లి ఆపు చేసేశారు.

ఆత్మాభిమానం.. ఈ పదానికి ఆమె నిదర్శనంలా నిలిచింది. అవును ఆమె పెళ్లి ఎందుకు వద్దని అందో తెలిస్తే మీరూ ఇదే ఒప్పుకుంటారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకునే వరుడికి ఆమె తల్లి డబ్బు ఇచ్చింది. అదీ ఈమెను డేటింగ్ కు తీసుకువెళ్ళమని. అంతేకాదు.. తన కూతురుతో పాటు కాబోయే అల్లుడికీ అత్యంత ఖరీదైన బట్టలు ఆమె కొంది. అతని బట్టలు మనం ఎందుకు కొనాలి అని పెళ్ళికూతురు అడిగితే వాళ్ళు పేదవాళ్ళు కదా అని చెప్పింది తల్లి. అయితే, వివాహ నిశ్చయానికి ఎంతో ఖరీదైన వజ్రపు ఉంగరం పెళ్ళికొడుకు ఆమెకు పెట్టాడు. అది చూసి మీ దగ్గర అంత డబ్బు ఉండదు కదా.. మరి ఇంత ఖరీదైన ఉంగరం ఎలా వచ్చింది? అని ప్రశ్నించింది. కానీ, ఆమెకు సారిన సమాధానం దొరకలేదు.

దీంతో ఆమెకు అనుమానం ప్రారంభం అయింది. ఆ ఉంగరం ఎక్కడ కొన్నారో అక్కడికి వెళ్ళింది. ఆ దుకాణదారుడుని ఈ ఉంగరం ఎవరు కొన్నారు అని అడిగింది. వాళ్ళిచ్చిన సమాచారంతో అది తన తల్లి కొన్నాదని అర్ధం అయింది. అప్పుడు ఆమె మొత్తం అన్ని విషయాల వెనుకా ఏమి జరిగింది అనేది ఆరాతీసుకుంటూ పోయింది. చివరికి ఈ పెళ్లి కోసం పెళ్లికొడుకు డబ్బులు అడిగాడనీ, ఈమె తల్లి ఆడబ్బులు ఇచ్చిందనీ తెలిసింది. దీంతో ఈ అమ్మాయి ఆత్మాభిమానం దెబ్బతింది. అంతే, నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ భీష్మించింది.

ఈ ఉదంతంపై ఆమె ఇలా చెప్పింది.. ”నేను అంతకు ముందు ద్విలింగ సంపర్కురాలిగా ఉన్నాను. కానీ, నా తల్లి ప్రోత్సాహంతో మామూలుగా జీవిస్తున్నాను. నన్ను ఒక పురుషుడితో పెళ్లి చేయాలని మా అమ్మ కోరిక. అందుకు నేనూ ఒప్పుకున్నాను. కానీ, నా తల్లి దాని కోసం డబ్బు కోసం ఆశపడే ఒకడిని తీసుకువచ్చింది. ఆ అబ్బాయితో నా మొదటి పరిచయం జరిగిన హోటల్ (ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్) బిల్లు మా అమ్మే చెల్లించింది. అక్కడ నుంచి అతను ఖర్చు చేసిన ప్రతి సొమ్మూ మా అమ్మ తనకు ఇచ్చిందే. నేను అతనిని మనస్పూర్తిగా పెళ్లి  చేసుకుందామని అనుకున్నాను కానీ అతను కేవలం మా అమ్మ ఇచ్చిన డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అందుకే ఈ పెళ్లి వద్దన్నాను. నేను మా అమ్మతో ఉండడమే నాకిష్టం. ఇలా డబ్బు కోసం నాదగ్గరకు వచ్చేవాళ్ళు నాకొద్దు. అంటూ ఆ యువతి చెప్పింది.

Also Read: సింగపూర్ లో 12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్, యుధ్ధ ప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం, అమెరికా పంథాను అనుసరిస్తున్న నిపుణులు

China Population: తగ్గిపోతున్న జనాభా వృద్ధిరేటు… ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తేసే యోచనలో చైనా!