Marriage: 91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..!

Marriage: భారతదేశంలో సాధారణంగా వృద్ధాప్యంలో భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు చనిపోతే, మిగిలిన వారు తమ జీవితాంతం ఒంటరిగా

Marriage: 91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..!
Old Marriage
Follow us

|

Updated on: Mar 28, 2022 | 8:28 AM

Marriage: భారతదేశంలో సాధారణంగా వృద్ధాప్యంలో భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు చనిపోతే, మిగిలిన వారు తమ జీవితాంతం ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తారు. తమ కొడుకులు, కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే కొందరు మాత్రం వృద్ధాప్యంలోనూ పెళ్లిళ్లు చేసుకుంటారు. ముఖ్యంగా విదేశాలలో ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. 60-65 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటారు. అలాంటి విచిత్రమైన పెళ్లి ఒకటి ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ పెళ్లి ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది.

68 ఏళ్ల వ్యక్తి తనకంటే 23 ఏళ్లు పెద్ద అయిన 91 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు. పెళ్లైన కొన్ని సంవత్సరాలకు అతను కోటీశ్వరుడయ్యాడు. అసలు విషయం ఏంటంటే.. ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లో నివసిస్తున్న 91 ఏళ్ల జోన్ బ్లాస్ అనే మహిళ 2016 హత్యకు గురైంది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు ఆమె 68 ఏళ్ల వ్యక్తిని వివాహమాడింది. ఆమె పేరిట రూ.2 కోట్ల ఆస్తి ఉంది. పెళ్లై కొంతకాలం వీరి జీవితం సాఫీగా సాగింది. ఆ తరువాత ఆమె చనిపోవడంతో.. ఆ ఆస్తి అంతా ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి దక్కింది. అయితే, సదరు వృద్ధురాలి కుటుంబ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అతనిపై రివర్స్ కేసు పెట్టారు.

రహస్య వివాహం.. 91 ఏళ్ల జోన్ బ్లాస్ కుమార్తె ఫ్రాంక్స్(62), కుమారుడు మైఖేల్ (53) లీడ్స్‌ లోని సివిల్ కోర్టులో సదరు వ్యక్తిపై పిటిషన్ వేశారు. ఆ వ్యక్తి తమ తల్లిని రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. తమ తల్లి జాన్ బ్లాస్‌కు డిమెన్షియా సమస్య ఉందని, దాని కారణంగా ఆమె అన్నీ మర్చిపోతుంటుందని చెప్పారు. తన భర్త అని చెప్పుకునే వ్యక్తిని సైతం ఆమె గుర్తు పట్టలేదన్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు అని ఎప్పుడూ అడిగేదన్నారు.

అతనికే రూ. 2 కోట్ల ఆస్తి.. అయితే, సదరు వ్యక్తి జోన్ బ్లాస్‌ను మోసపూరితంగా వివాహం చేసుకున్నాడని రుజువు చేయడానికి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ మహిళ కుమారుడు, కుమార్తె అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. మహిళకు చెందిన రూ. 2 కోట్ల విలువైన ఆస్తులు ఆమె భర్త పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.

Also read:

Viral Video: నాకూ ఒకటి కావాలి.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్ర అద్భుతమైన రియాక్షన్..!

Toll Plaza: టోల్ ప్లాజాల తొలగింపు.. వాహనదారులకు ఊరట లభించేనా..?

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా ఆందోళనలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో ఇలా..