Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

సుజనా చౌదరిలో ఊహించని ఛేంజ్..! రీజన్ అదేనా..?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు..ఎన్నిసార్లు యూజ్ చేసిన వెగటు వేయని సామెత ఇది. దాన్ని పలుచన చెయ్యడానికి ఏ పొలిటిషియన్స్ ఇష్టపడటం లేదు. అలానే ఎంపీ సుజనా చౌదరి ఊహించని విధంగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంఫ్ అయ్యారు. పనిలో పనిగా సహచరుల మెడలో కాషాయ కండువా వేయించి..చంద్రబాబుకు ఓ రేంజ్ షాక్ ఇచ్చారు. అయితే పార్టీ మారిన దగ్గర్నుంచి సుజానాలో ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది.

గతంలో ఆయన టీడీపీలో ఉన్నా కూడా ఎన్నికల సమయాల్లో తప్ప పెద్ద యాక్టీవ్‌గా కనిపించేవారు కాదు. ఫైనాన్షియల్‌గా పార్టీకి తోడ్పాటునందించడం..అందుకు రిటర్న్‌గా ప్రతిఫలం పొందడం అప్పట్లో ఆయన స్టైల్. అలానే అప్పుడప్పుడు పార్టీ కోసం ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించి కీలక సమయాల్లో వార్తల్లో నిలిచేవారు. అంతేకానీ పార్టీ కండువా బుజాన వేసుకోని..జెండాకర్ర పట్టుకోని కష్టపడ్డ సందర్బాలు మాత్రం చాలా రేర్.

కానీ ఇప్పుడు సుజానా చౌదరి పూర్తిగా మారిపోయారు. బయటకొస్తే చాలు..మెడలో కాషాయ కండువా దర్శనమిస్తోంది. ఇక ప్రెస్‌మీట్స్, పబ్లిక్ ఫంక్షన్స్ సరేసరి. ఇక ర్యాలీలలో ఏకంగా జెండా కర్రనే బుజనా వేసుకోని బయలుదేరుతున్నారు. అంతేకాదు పార్టీ సభ్యత్వాలను కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు.  ఇదంతా ఎందుకు అంటే ఆ కిటుకు అందరికి తెలిసిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జాతీయ పార్టీ అయిన బిజేపీలో పదవులు దక్కాలంటే ఇంకా కష్టపడాలని లెక్చర్లు ఇస్తున్నారు.

మాములుగా అయితే బీజేపీలో సంఘ్ నుంచి వచ్చినవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వారు ఒక డెడికేషన్‌తో పనిచేస్తారు..ప్రలోభాలకు, ప్రభావాలకు లొంగరని బయట టాక్ ఉంది. అందుకే మెజార్టీ పదువుల్లో వారే ఉంటారు. ఇక అనివార్య పరిస్థితుల్లో..రాజకీయాలను ప్రభావితం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే బీజేపీలో బయటవాళ్లకి పదవులు కేటాయిస్తారు. సుజనా చౌదరి తాను పార్టీ మారడమే కాదు..ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అయ్యేలా చక్రం తిప్పారు. ఇక రాజ్యసభలో అధికార బీజేపీ ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులు పాసయ్యేందుకు కూడా సుజానా గేమ్ ప్లే చేశారని వార్తలు వినిపించాయి. ఆ రకంగా బీజేపీ పెద్దల నమ్మకం చూరగొన్నారు.  ఈ సారి మోదీ కేబినెట్ విస్తరణ చేపట్టినప్పుడు ఏపీ కోటాలో సుజనా మంత్రి పదవి ఆశించే లిస్టులో ఉన్నారట. అందుకే కొత్త రాజకీయానికి తెరలేపారని టాక్ నడుస్తోంది.