Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • విజయవాడ: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్. ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం. ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్. ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి. కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది.
  • గడిచిన 24 గంటల్లో ఢిల్లీ లో 1076 కొత్త పాజిటివ్ కేసులు,11 మంది మృతి. ఢిల్లీవ్యాప్తంగా 140232 కేసులు నమోదు. 10072 యాక్టీవ్ కేస్ లు. 126116 మంది డిశ్చార్జ్. మొత్తం 4044 మంది మృతి
  • రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కృష్ణ నీటి పంపకాలు చేపట్టిన కృష్ణ మేనేజ్మెంట్ బోర్డు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ వాటాగా 37.672 టీఎంసీలు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాటాగా 17 టీఎంసీలు.
  • చెన్నై: చెన్నై విమానాశ్రయం లో వరుసగా పట్టుబడుతున్న బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా తరలిస్తున్న 731 గ్రాముల బంగారం స్వాధీనం . పట్టుబడ్డ బంగారం విలువ 35 లక్షలు ,బంగారాన్ని పేస్ట్ రూపం లో మార్చి అక్రమ రవాణా చేస్తున్న ముఠా . తంజావూర్ కి చెందిన ఇద్దరు అరెస్ట్ చేసి విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు . నిన్న సాయంత్రం 83 లక్షలు విలువ చేసే 1 .48 కేజీల బంగారం పట్టుకున్న అధికారులు.
  • విజయవాడ: బీజేపీ నుండి మరో నేత సస్పెండ్. పార్టీ లైన్ కి భిన్నంగా మాట్లాడుతున్న వారిని వరసగా సస్పెండ్ చేస్తున్న బిజెపి. ఇప్పటికే పలువురు నేతలు సస్పెండ్.. మరి కొంత మందికి నోటీసులు ఇచ్చిన ఏపీ బీజేపీ. లేటెస్ట్ గా మరొకరు తిరుపతి కి చెందిన ఓ వి రమణ సస్పెండ్. మూడు ముక్కలాట లో నష్టపోతున్న బీజేపీ అని ఒక దిన పత్రికలో ఆర్టికల్ రాసిన తిరుపతి కి చెందిన బీజేపీ నేత ఓ వి రమణ .
  • అమరావతి: ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ బిల్లుకు గవర్నర్ ఆమోదం. ఆక్వా అభివృద్ధి, ఆక్వా కల్చర్ మానిటర్, ప్రమోట్, రెగ్యులేషన్ లక్ష్యాలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం.
  • కరోనాకు ట్యాబ్లెట్లను, ధరను ప్రకటించిన ఫార్మా కంపెనీ లుపిన్! యాంటి వైరల్ డ్రగ్ ఫివిపరవిర్ కు జెనరిక్ వర్షన్ ను తీసుకొస్తున్న లుపిన్. కోవిహాల్ట్ పేరుతో ట్యాబ్లెట్లను అందుబాబులోకి తెస్తున్న వైనం. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 49. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు, ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ కీలక ప్రకటన చేసింది.

బరువు తగ్గిన చిదంబరం.. హైదరాబాదీ డాక్టర్ వైద్యం

treatment given to p.chidambaram not satisfactory says family, బరువు తగ్గిన చిదంబరం.. హైదరాబాదీ డాక్టర్ వైద్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైల్లో తన అనారోగ్యానికి గాను ఆయనకు లభిస్తున్న చికిత్స సంతృప్తికరంగా లేదని, ఫలితంగా వ్యాధి తీవ్రత పెరిగి 8 నుంచి 9 కేజీల బరువు తగ్గారని వారు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆయనకు చికిత్స చేయాలని తాము కోరుతున్నామని, 2016 లో కూడా ఈ డాక్టరే ఆయనకు ట్రీట్ మెంట్ చేశారని వారు పేర్కొన్నారు. నాగేశ్వరరెడ్డి చికిత్స అనంతరం చిదంబరం ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడిందన్నారు. చిద్దూ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Tags