కరోనా చికిత్సపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. విజృంభిస్తున్న కోవిడ్‌తో రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టెస్టింగ్ ల్యాబ్‌లు, చికిత్సా సెంటర్లు కూడా రద్దీగా మారిపోతున్నాయి.

కరోనా చికిత్సపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Jul 04, 2020 | 3:41 PM

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. విజృంభిస్తున్న కోవిడ్‌తో రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, ఐపీఎస్‌లను కూడా వైరస్ మహమ్మారి వదలడం లేదు. రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న క్రమంలో టెస్టింగ్ ల్యాబ్‌లు, చికిత్సా సెంటర్లు కూడా రద్దీగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్‌ కోసమే ప్రత్యేకించి కేటాయించిన గాంధీ ఆస్పత్రిలో చికిత్సపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. జి. శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.

దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. జి. శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేల మందికి పైగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 వేల మందికి పైగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కరోనా బాధితుల కోసం నగరంలోని నాలుగు ఆస్పత్రుల్లో 2501 పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నేచర్ క్యూర్, ఆయుర్వేద ఆస్పత్రుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వెయ్యి మందికి పైగా ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. అవసరమైన వారికి టెలిమెడిసిన్ సేవలు, వీడియో కాల్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం మార్చి నెలలోనే ముందు జాగ్రత్తలు చేపట్టిందని, టెస్టుల కోసం ప్రత్యేకించి ల్యాబ్‌లు, చికిత్స ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసిందని తెలిపారు.