వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిన చిరుతపులి… కాపాడిన అటవీశాఖ అధికారులు… చికిత్స తర్వాత జూకు తరలింపు…

వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిన చిరుత పులిని అటవీ శాఖ అధికారులు కాపాడారు. గాయాలపాలైన చిరుతను చికిత్స అనంతరం జూకి తరిలిస్తామని తెలిపారు.

వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిన చిరుతపులి... కాపాడిన అటవీశాఖ అధికారులు... చికిత్స తర్వాత జూకు తరలింపు...
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2020 | 6:23 PM

Trapped leopard rescued by forest officials in dharamshala  వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిన చిరుత పులిని అటవీ శాఖ అధికారులు కాపాడారు. గాయాలపాలైన చిరుతను చికిత్స అనంతరం జూకి తరిలిస్తామని తెలిపారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే….

హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలో…

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ధర్మశాల పరిధిలోని ఫతేపూర్ అడవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ చిరుతపులి చిక్కిందని అటవీ శాఖ అధికారి అనిల్ ఠాకూర్ తెలిపారు. స్థానికులు అందించిన సమాచారంతో చిరుతపులిని కాపాడామని అన్నారు. గాయాలపాలైన చిరుతపులికి చికిత్స అందిస్తున్నామని వివరించారు. చికిత్స అనంతరం గోపాల్‌పూర్ జూకు తరలిస్తామని ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో సంవత్సరంలో దాదాపు ఇటువంటి ఘటనలు పదుల సంఖ్యలో జరుగుతాయని తెలిపారు. చిరుతపులల వేటను అరికట్టేందుకు అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఠాకూర్ తెలిపారు. వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.