Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

భారీ పెనాల్టీల ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎక్కడికక్కడ వాహనాల బంద్!

Delhi NCR Transport Strike Over New MV Act, భారీ పెనాల్టీల ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎక్కడికక్కడ వాహనాల బంద్!

కేంద్రం కొత్తగా అమలులోకి తెచ్చిన మోటారు వాహన చట్టంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజధాని ఢిల్లీలో భారీ ఫైన్లను వ్యతిరేకిస్తూ.. పలు ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు ఇవాళ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెతో వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు బస్సులు, ఆటో రిక్షాలు, ట్రక్కులు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు సైతం నిలిచిపోవడంతో పలు స్కూళ్ళు, విద్యాసంస్థలకు అంతరాయం ఏర్పడింది. దీనితో అవి కూడా మూతపడ్డాయి. అంతేకాకుండా ఢిల్లీలోని నోడియా ప్రాంతంలో ఉండే పలు కార్యాలయాలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఈ సమ్మె వల్ల ఇవాళ సెలవును ప్రకటించాయి.

Delhi NCR Transport Strike Over New MV Act, భారీ పెనాల్టీల ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎక్కడికక్కడ వాహనాల బంద్!

కొత్తగా ప్రవేశపెట్టిన మోటారు వాహనాల చట్టంలోని పలు సవరణలకు విరుద్ధంగా దాదాపు 41 ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు పిలుపునిచ్చిన ఈ వన్ డే స్ట్రైక్‌లో ఢిల్లీ రీజియన్‌కు చెందిన పలు బస్సులు, ఆటోలు, టెంపోలు, క్యాబ్‌లు పాల్గొన్నాయి. ఇకపోతే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఈ సమ్మె జరగనుంది. మోటార్‌ వాహన చట్టానికి చేసిన సవరణలు మార్చాలని, భారీ పెనాల్టీల నుంచి ఉపశమనం కల్పించాలని, ప్రైవేట్‌ వాహన డ్రైవర్లకు బీమా, వైద్య సదుపాయం కల్పించాలని ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నారు. మరి చూడాలి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Delhi NCR Transport Strike Over New MV Act, భారీ పెనాల్టీల ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎక్కడికక్కడ వాహనాల బంద్!